విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ సినిమా అక్కడ జూలై 25న రిలీజ్ అయ్యింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉండటం వల్ల ఒక వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 1న ‘సార్ మేడమ్’ గా రిలీజ్ అయ్యింది.
తమిళంలో పలు హిట్ సినిమాలు తీసిన పాండిరాజ్ దర్శకుడు. చాలా కాలం తర్వాత తమిళ సినిమాకి తెలుగు ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే టైటిల్ పెట్టి విడుదల చేశారు. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అక్కడ రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతుంది. కానీ తెలుగులో కింగ్డమ్, మహావతార్ నరసింహ వంటి క్రేజీ సినిమాలు ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే
నైజాం | 0.53 cr |
సీడెడ్ | 0.24 cr |
ఆంధ్ర(టోటల్) | 0.34 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.11 cr(షేర్) |