దయచేసి మమ్మల్ని విడదీయకండి : నారా రోహిత్

జూ.ఎన్టీఆర్ మామగారైన నార్నె శ్రీనివాస రావు పై ప్రముఖ సినీ నటుడు, స్వయానా నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకైన నారా రోహిత్ ఫైరయ్యాడు.దీనికి ముఖ్యకారణం తన తమ్ముడు రామమూర్తి నాయుడిని పట్టించుకోకుండా దూరం పెట్టారని వైసీపీ నేత, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు చేసిన ఆరోపణలే అని షష్టమయ్యింది. ‘మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా మధ్య విబేధాలు సృష్టించకండి’ అంటూ ఓ లేఖ రాశాడు నారా రోహిత్.

రోహిత్ ఈ లేఖ ద్వారా స్పందిస్తూ… “పెదనాన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా చూసుకుంటున్నారో మమ్మల్ని కూడా అలానే చూసుకుంటున్నారు. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, నాన్నల మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పడం చాలా బాధాకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విబేధాలు సృష్టించడం తప్పు. నారా పేరుని నిలబెట్టడానికి తమ కుటుంబం నుండి ఒక్కరు చాలు, ఆ కారణంగానే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. పెదనాన్న మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదనలో ఎంతమాత్రం నిజం లేదు. రాత్రింబవళ్ళు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఏవిధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని కూడా అదేవిధంగా చూసుకుంటున్నారు. నా తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఈ కారణంగానే ఆయన ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొలేక… ఇలా వ్యక్తిగత విషయాల పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు” అంటూ మండిపడ్డాడు నారా రోహిత్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus