కలిసి నటిస్తే.. కాపురం చేసినట్లేనా?

“నాకు వేరే హీరోయిన్లు దొరక్కో లేక ఇంకెవరూ నచ్చకో కాదు.. ఆ క్యారెక్టర్ ఆవిడ ప్లే చేస్తే బాగుంటుంది అనిపించి రెజీనాను ఆ మూడు సినిమాల్లో నటింపజేయడం జరిగింది. అయినా హీరోయిన్ సెలక్షన్ అనేది నా చేతిలో ఉండదు కూడా. అది దర్శకుల ఇష్టం. ఈమాత్రం దానికే నాకు ఆమెతో లింక్ పెట్టేసి.. త్వరలో పెళ్లి, ఇంట్లో లొల్లి” అంటూ కథనాలు రాసేస్తే ఎలా చెప్పండి అంటూ వాపోతున్నాడు నారావారి నటవారసుడు నారా రోహిత్. అతడు నటించిన తాజా చిత్రం “బాలకృష్ణుడు” ఈ శుక్రవారం (నవంబర్ 24) విడుదలవుతోంది. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నారా రోహిత్ తో జత కట్టడం ఇది మూడోసారి. ఇదివరకు “శంకర, జో అచ్యుతానంద” చిత్రాల్లో రోహిత్ సరసన నటించిన రెజీనాను ముచ్చటగా మూడోసారి తన సరసన నటింపజేసేసరికి వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. మామూలుగా అయితే ఇలాంటి గాసిప్పులకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ.. రోహిత్ తనకు గల రాజకీయ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయమై రెస్పాండ్ అయ్యి.. అలాంటిదేమీ లేదని, తన పెళ్ళికి కూడా అప్పుడే తొందరేం లేదని చెప్పడమే కాక తాను ఇంట్లోవాళ్లు చూసిన సంబంధమే చేసుకొంటానని, ఈ ప్రేమ పెళ్లి అనేది తనకు నచ్చదని కూడా కాస్త గట్టిగా చెప్పాడు.

ఇక రెజీనాకు ఈ తరహా ఎఫైర్ న్యూస్ కొత్తేమీ కాదు. అప్పట్లో సందీప్ కిషన్ ను కూడా రెజీనా పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. సో, ఆమె మాత్రం ఈ గాసిప్పులను పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus