నారా రోహిత్…అటు నందమూరి అభిమానులు…ఇటు నారా వారి మద్దతుదారులు అందరూ కలసి బలమైన హీరోగా నిలబెట్టిన హీరో మన నారా వారి అబ్బాయి రోహిత్. అయితే తొలి రోజుల్లో కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడినా పోను..పోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలి అన్న ఆలోచనతో డిఫరెంట్ మూవీస్ ను తీశాడు రోహిత్…అయితే అదే క్రమంలో సూపర్ హిట్స్ సైతం సాధించాడు…ఒక పక్క పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క ‘జ్యో అచ్యుతానంద’ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ లో కూడా నటించాడు మన నారా కుర్రోడు…అయితే అదే క్రమంలో…రోహిత్ నటిస్తున్న చిత్రాలు అన్నీ బాక్సాపీస్ వద్ద నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలను చేకూరుస్తూ వస్తున్నాయి….తాజాగా వచ్చిన ‘జ్యో అచ్యుతానంద’ కూడా సింపల్ గా ఉండడంతో ప్రవాసాంధ్రులు ఈ సినిమాకు బ్రహ్మ రధం పట్టారు.
అదే ఊపులు శంకర అనే సినిమాను తీశాడు రోహిత్…ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అందుకుంటుంది అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు….కానీ గత శుక్రవారం విడుదలయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డమల్ అని అనడంతో ఈ ఫలితాన్ని ఊహించలేదు అంటున్నాడు మన హీరో. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం…శంకర మూవీకి ప్లస్ పాయింట్ గా మూలకథ ఉన్నప్పటికీ..సరైన స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవటంతో ప్రేక్షకులు కొంత బోర్ గా ఫీల్ అయ్యారు. ఇక బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ సైతం ఆశించినంతగా లేవట…ఈ లెక్కలను గమనిస్తున్న రోహిత్…మరోసారి ఈ తరహా కథలో జరిగిన తప్పులను ఇంకెప్పుడూ రిపీట్ చేయకుడదని నిర్ణయించుకున్నాడంట. దీంతో నారా రోహిత్ తన అప్ కమింగ్ మూవీల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మొదలు పెట్టాడు అని టాక్…మరి అదే క్రమంలో ‘ఆ రోజుల్లో ఒకడు ఉండేవాడు’ అయినా రోహిత్ కు మంచి హిట్ ఇవ్వాలి అని కోరుకుందాం.