అప్పటి వారు ఇప్పుడు ప్రమోషన్ మొదలెట్టారు…

గతేడాది ‘అసుర’ అనే ఒకే ఒక్క సినిమాతో తెరమీదికొచ్చిన నారా రోహిత్ ఈ ఏడాదికోసం అరడజనుకి పైగా సినిమాలను సిద్ధం చేశాడు. వాటిలో ఇప్పటికి నాలుగు విడుదల కాగా విజయం వరించింది మాత్రం ‘జ్యో అచ్యుతానంద’ సినిమాకే. సినిమాతోపాటు రోహిత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. ఇక ఇదే ఊపులో మరో సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు ఈ నారా వారి హీరో.

‘అయ్యారే’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రోహిత్ నటించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. ‘హి ఈజ్ మిస్సింగ్ ఇన్ ది పేజెస్ ఆఫ్ హిస్టరీ’ అన్నది ఉప శీర్షిక. శ్రీ విష్ణు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా తెరమీదికొస్తే సరిపోదు కదా తెరముందు ప్రేక్షకులు కూడా ఉండాలి. అందుకోసమే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది చిత్ర బృందం. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రచారం కోసం టైటిల్ తగ్గట్టుగా సినిమాలో నటించిన వారి ఒకప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచి వారిని గుర్తించమని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈరోజుల్లో ప్రచారానికని ఎన్ని కోట్లు ధారపోస్తున్నా అవన్నీ సోషల్ మీడియా ముందు దిగదుడుపు అన్నట్టే ఉన్నాయి. ఆ లెక్కన వీరి వ్యూహం ఫలిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక రోహిత్ కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=KfJcI1bMle0

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus