బెంగాలీ భామపై మనసుపడ్డ రోహిత్

చాలా మంది హీరోయిన్స్ ఈ రోజుల్లో రెండు సినిమాలతో హిట్టు అందుకోగానే రెమ్యునరేషన్ గట్టిగా పెంచేస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు ఎక్కువగా కొత్త అమ్మాయిలను వెతుక్కుంటూ వెళుతున్నారు. హీరోలు కూడా చాలా వరకు కొత్త భామలతో చేస్తేనే బెటర్ అనే ఆలోచనతో కొత్త వారికి ఛాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోకి రావడానికి చాలా మంది కొత్త అమ్మాయిలు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఎదో అవకాశం దొరికింది కదా అని ఒప్పుకోవడం లేదు. సినిమాలో మ్యాటర్ ఉంటేనే చేయడానికి ఒప్పుకుంటున్నారు. అలాగే వారి పాత్రకు కూడా తగిన గుర్తింపు ఉందా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా నారా రోహిత్ సినిమాలో ఒక కొత్త మోడల్ సెలెక్ట్ అయ్యింది. నారా రోహిత్ – పరుచూరి మురళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోయే ఆ సినిమాకు ఆటగాళ్లు అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. అయితే గత కొంత కాలంగా రోహిత్ కోసం దర్శకుడు చాలా మంది హీరోయిన్స్ ని చూశాడు. కొందరు మీడియం హీరోయిన్స్ పారితోషికం గట్టిగానే అడిగారట. అయితే రోహిత్ కొత్త వారితో వెళితే బెటర్ అనుకోని ఒక బెంగాల్ బ్యూటీని సెలెక్ట్ చేశారట. దర్శనా బానిక్ అనే ఈ మోడల్ రోహిత్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ బ్యూటీ టాలీవుడ్ కి కొత్త అయినా బెంగాలీ సినిమాలకు కొత్త కాదు. ఆల్ రెడీ రెండు సినిమాల్లో చేసింది. అలాగే ప్రస్తుతం ఆరు సినిమాలకు కూడా సైన్ చేసింది. ఇక మోడల్ ప్రపంచంలో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. రీసెంట్ గా దర్శకుడు ఆమె ఫోటో స్టిల్స్ ని చూసి పాత్రకు తగ్గటు సెట్ అవుతుందని ఫైనల్ చేసేశాడు. అది మ్యాటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus