వరుస పరాజయాలతో ఢీలాపడ్డ నారా రోహిత్ పరిస్థితి ఏంటి?

పోలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోగా మాత్రమే కాదు.. స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ తో సంబంధం లేకుండా కేవలం కథలను నమ్ముకొని సినిమాలు తీసిన ఏకైక హీరో నారా రోహిత్. మొదట్లో మనోడి స్క్రిప్ట్ సెలక్షన్ కానీ, పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ సినిమాలకి ప్రాణం పోసిన విధానం కానీ ప్రేక్షకులని మాత్రమే కాదు సినిమా విశ్లేషకుల్ని కూడా ఆశ్చర్యపరిచాడు. అయిదారేళ్ళ క్రితం వరకూ నారా రోహిత్ స్టార్ సినిమాలు చూసి “ఈ అబ్బాయి కచ్చితంగా పెద్ద స్టార్ హీరో అయిపోతాడు” అనుకొనేవారందరూ.

కట్ చేస్తే.. గత కొన్నాళ్లుగా రోహిత్ నటించిన ప్రతి సినిమా ఫెయిల్ అవ్వడం కంటే ఎక్కువగా.. యాక్టర్ గా రోహిత్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఇక రోహిత్ రీసెంట్ మూవీస్ అయితే ఒకటి తర్వాత ఒకటి దారుణంగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఎప్పుడూ కనీసం చేతిలో అయిదారు ప్రొజెక్టులతో బిజీగా ఉండే నారా రోహిత్ చేతిలో ప్రస్తుతం కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు సినిమాల రిజల్ట్స్ బట్టి తదుపరి చిత్రాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ.. యువ కథానాయకుడిగా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే స్థాయి నుంచి ఉనికిని కాపాడుకోవాల్సిన స్థాయికి దిగజారడం అనేది మాత్రం కచ్చితంగా రోహిత్ చేజేతులారా చేసుకొన్న తప్పే. మరి తదుపరి చిత్రాలతో ఆ తప్పును సరిదిద్దుకొంటాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus