ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న నారారోహిత్ ‘సావిత్రి’

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాతగా నారారోహిత్ -నందిత కాంబినేషన్ లో వస్తున్నా ‘సావిత్రి’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా…..

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’ ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన రోజు నుండి ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా మొత్తం పూర్తయింది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల శ్రవణ్ అందించిన పాటలు విడుదలయ్యాయి. పాటలకు ఆడియెన్స్ ను మంచి స్పందన వస్తుంది. రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus