తలైవా రజనీకాంత్ 75వ జన్మదినం సందర్భంగా డిసెంబరు 12న ఆయన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నరసింహ’ను రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా తలైవా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. సినిమా గురించి చెబుతూ ఎవరికీ తెలియని ఓ పాత విషయాన్ని, అలాగే ఆ సినిమా సీక్వెల్ సంబంధించిన ఆసక్తికరమైన మరో విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ రెండు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ రోజుల్లో ఆడవాళ్లు థియేటర్ల గేట్లు బద్దలు కొట్టి మరీ థియేటర్లలోకి వచ్చిన సినిమా ‘నరసింహ’. అలాంటి సినిమాకు సీక్వెల్ ఆలోచ చేశాం అంటూ ఘనంగా సినిమా సీక్వెల్ అంశాన్ని అనౌన్స్ చేశారు రజనీకంత్. ఇప్పుడు చాలా సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. అలాంటప్పుడు ‘నరసింహ’ సినిమాకు ఎందుకు సీక్వెల్ తీయకూడదు అనిపించిందని తైలవా చెప్పారు. ‘2.0’, ‘జైలర్ 2’ సినిమాలు చేసేటప్పుడు ఈ ఆలోచన వచ్చిందట. నరసింహ రెండో భాగాన్ని ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో రూపొందిస్తారట. ప్రస్తుతం స్టోరీపై చర్చలు నడుస్తున్నాయని కూడా చెప్పారు.
ఇక ‘నరసింహ’ తొలి భాగం గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో నీలాంబరి పాత్ర కోసం తొలుత ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించినట్లు రజనీకాంత్ చెప్పారు. ‘నరసింహ’ సినిమా కథను నేనే రాశాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఇందులో నీలాంబరి కోసం ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదించాం. కానీ, ఆమె ఆసక్తి లేదని చెప్పారు. ఆ తర్వాత శ్రీదేవి, మాధురీ దీక్షిత్ పేర్లను కూడా పరిశీలించాం. అలా చాలామంది పేర్లు చర్చించుకున్న తర్వాత రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పారట. అలా ఆమె సినిమాలో భాగమైందట.
1999లో విడుదలైన ‘పడయప్ప’ / ‘నరసింహ’ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి. ఆ పాత్ర తర్వాత అంతే పవర్‌ఫుల్ రోల్ నీలాంబరి. సినిమా వచ్చి 26 ఏళ్లు అవుతున్నా ఈ పాత్ర నేటికీ సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండింగ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు.