Narayana & Co Review in Telugu: నారాయణ & కో సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుధాకర్ కొమాకుల (Hero)
  • ఆరతి పొడి (Heroine)
  • ఆమని, దేవి ప్రసాద్, యామిని బి, పూజా కిరణ్, జై కృష్ణ, సప్తగిరి, అలీ రెజా, రాగిణి, అనంత్, శివ రామచంద్రపు, తోటపల్లి మధు తదితరులు (Cast)
  • చిన్న పాపి శెట్టి (Director)
  • పాపి శెట్టి బ్రదర్స్ & సుధాకర్ కోమాకుల (Producer)
  • డా. జోస్య భట్ల శర్మ, నాగ వంశీ, సురేష్ బొబ్బిలి (Music)
  • రాహుల్ శ్రీవాస్తవ్ (Cinematography)
  • Release Date : జూన్ 30, 2023

ఈ వారం అరడజను కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘నారాయణ & కో’ కూడా ఒకటి.పెద్దగా బజ్ కూడా లేదు. కానీ టీజర్, ట్రైలర్లు అయితే బాగానే ఉన్నాయి. అందువల్ల కొంతమంది ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశాలు ఉన్నాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కొమాకుల ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ సినిమా ట్రైలర్ కి తగ్గట్టు ఉందో లేదో తెలుసుకుందాం రండి :

కథ : నారాయణ(దేవి ప్రసాద్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అతను తన భార్య(ఆమని), ఇద్దరు కొడుకులు ఆనంద్(సుధాకర్ కొమాకుల) సుభాష్(జై కృష్ణ) లతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆనంద్ బెట్టింగ్లలో చాలా డబ్బు పోగొట్టుకుంటాడు. అదే టైంలో అతని ప్రైవేట్ వీడియో ఉందంటూ ఓ వ్యక్తి అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. మరోపక్క నారాయణ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ అండ్ ఫ్యామిలీ ఓ స్కామ్ వేసి డబ్బులు లాగాలని ప్లాన్ చేస్తారు. మరి వారి ప్రయత్నం సఫలమైందా.. విఫలమైందా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది దేవి ప్రసాద్ గురించి. గతంలో ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు. ఇతనిలో ఇంత కామెడీ టైమింగ్ ఉందని ఎక్కువమందికి కూడా తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. నారాయణ పాత్రకి ఇతను తన వంతు న్యాయం చేశాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమని కూడా అక్కడక్కడా నవ్వించింది. సుధాకర్ కొమాకుల జస్ట్ ఓకే. ఆ సీనియర్స్ ముందు ఇతని సిన్సియర్ ఎఫర్ట్ ఎందుకో చిన్నగా కనిపించింది. ఆరతి ఓకే అనిపించింది. జై కృష్ణ కూడా జస్ట్ ఓకే అనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు చిన్న పాపిశెట్టి ఫస్ట్ హాఫ్ విషయంలో పర్వాలేదు అనిపించాడు. రొటీన్ కథ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో అలాంటి ఫీలింగ్ రాదు. సెకండాఫ్ విషయంలో పూర్తిగా గాడి తప్పాడు. ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వడంతో పాటు సెకండాఫ్ లో ల్యాగ్ అనే ఫీలింగ్ కూడా ఆద్యంతం కలుగుతూనే ఉంటుంది.నిర్మాణ విలువలు జస్ట్ ఓకే. నాగ వంశీ, సురేష్ బొబ్బిలి, జోశ్యభట్ల శర్మ సాంగ్స్ విషయంలో న్యాయం చేశారు. కానీ బిజీయం నిరాశపరిచింది. సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రమే.రన్ టైం 2 గంటల 16 నిమిషాలే ఉండటం ఓ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి.

విశ్లేషణ : ఫస్ట్ హాఫ్ వరకు ‘నారాయణ & కో’ పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడుంటే.. కంటెంట్ పరంగా పాస్ మార్కులు వేయించుకునేది ఈ మూవీ. కానీ ఇప్పుడు యావరేజ్ మూవీ అనే టాక్ తో సరిపెట్టుకుంటుంది. అయినప్పటికీ ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ :2.25/5

Click Here To Read in TELUGU

Rating

2.25
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus