Narne Nithin: ఎన్టీఆర్ తో సినిమాపై నార్నే నితిన్ రియాక్షన్.. కష్టమేనంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ తో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తారక్ సినిమాలకు సులువుగా 300 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరుగుతోంది. తారక్ సినిమాల థియేట్రికల్ హక్కులే ఏకంగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ (Narne Nithin) మ్యాడ్  (MAD)  సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నార్నే నితిన్ రెండో సినిమా ఆయ్ (AAY)  టైటిల్ తో తెరకెక్కుతుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ కాగా చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తారంటూ నార్నే నితిన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే నా స్థాయి చిన్నదని నార్నే నితిన్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే నేను చాలా తక్కువని నార్నే నితిన్ పేర్కొన్నారు. ఇప్పట్లో ఎన్టీఆర్ తో కలిసి నటించడం కష్టమేనని నార్నే నితిన్ క్లారిటీ ఇచ్చేశారు.

దేవర (Devara)  ముందు నేనెంత అని పరోక్షంగా నార్నే నితిన్ కామెంట్స్ చేశారు. అయితే భవిష్యత్తులో మాత్రం నార్నే నితిన్ నటుడిగా మరింత ఎదిగితే ఈ కాంబినేషన్ లో సినిమాను ఆశించవచ్చు. బామ్మర్ది కష్టపడి కెరీర్ పరంగా ఎదగాలని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారని అల్లు అరవింద్ వెల్లడించారు.

ఆయ్ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది. ఆయ్ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తే నితిన్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నార్నే నితిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus