నర్తనశాల ఆడియో రివ్యూ

  • August 25, 2018 / 07:36 AM IST

“ఛలో” తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య సొంత బ్యానర్లో చేసిన మూవీ @నర్తనశాల. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 30 న రిలీజ్ కానుంది. యామిని భాస్కర్‌, క‌ష్మిర ప‌ర‌దేశి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అలాగే మహతి స్వర సాగర్ స్వర పరిచిన గీతాలు అన్ని యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చాయి. ఈ అల్బ‌మ్ లో మొత్తం అయిదు సాంగ్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే..

దేఖొరే సోదరా..

ఆల్బంలో తొలిపాట ఇది. శ్రీ మణి సాహిత్యాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి చక్కగా పాడారు. ఇందులో హీరో క్యారెక్టెర్ ని క్లియర్ గా వివరించారు. అమ్మాయిల రక్షణకోసం దేవుడు ఇతన్ని పుట్టించాడా? అంటూ అబ్బాయిలు మొత్తుకునేలా ఉంటుంది ఈ పాట. “అమ్మకు అమ్మై ప్రేమని పంచగలడే” …”గురజాడ జాడలోన నడిచే కందుకూరు వీడే” అనే పదప్రయోగాలు బాగున్నాయి.

ఎగిరేనే.. మనసు

గిటారు స్ట్రింగ్స్ పైన ప్రేమ భావాలను అద్భుతంగా పలికించవచ్చు. అందుకేనేమో మహతి స్వర సాగర్ ఈ ప్రేమ గీతానికి గిటార్ తో మ్యాజిక్ చేశారు. “ఎగిరేనే.. మనసు” పాట వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. సమీరా భరద్వాజ్ అంత తీయగా ఈ పాటని పాడారు. ఇందులో స్వరకర్త కూడా గొంతు విప్పారు. భాస్కరభట్ల రవి కుమార్ సహజమైన పదాలతో మనసుకు హత్తుకునేలా రాశారు.

పిచ్చి పిచ్చి గా.. నచ్చావరా

హీరోని రెచ్చగొట్టే విధంగా హీరోయిన్ పాడే పాటలు ఇది వరకు అనేకం విన్నాము. కానీ ఇందులో “పిచ్చి పిచ్చి గా.. నచ్చావరా” అంటూ లిప్సిక పిచ్చెక్కించింది. ధర్మ తేజ వల్గర్ పదాల జోలికి వెళ్లకుండా అమ్మాయి మనసులోని భావాలను ఎంతో సున్నితంగా మేళవించి సాహిత్యాన్ని అందించారు. పాట మధ్యలో వచ్చే ఈల ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ.

అలా నాతో..

ఆల్బంలో ఉన్న ఒకే ఒక డ్యూయట్ ఇది. అయితే పాటని పరుగులు ఎత్తించకుండా ఒక మెలోడీగా మలచి కొత్తబాణీలో వినిపించారు. మొదట వినేటప్పుడు సోసో గా ఉన్నప్పటికీ స్లో పాయిజన్ మాదిరిగా నచ్చేస్తుంది.
శ్రీ మణి అందించిన సాహిత్యం యజిన్ నైజర్, రమ్య బెహెర గొంతులో ఎంతో మధురంగా ఉన్నాయి.

ఢోల్ భజే ..

పెళ్లికోసమే హీరో బృహన్నలా మారాడు.. గానీ నిజంగా తాను మాడా కాదని “ఢోల్ భజే” పాటలో ముందుగానే స్పష్టం చేశారు. పెళ్ళికి ఒకే చెప్పడంతో మొదలయ్యే ఈ పాటకి శ్రీ మణి సందర్భానికి సరిపోయే సాహిత్యాన్ని అందించగా.. యజిన్ నైజర్ మరింత జోష్ గా పాడి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పెళ్లి సందడిని తలపించే ఈ సాంగ్ ని కొత్తగా కంపోజ్ చేయడంలో మహతి స్వర సాగర్ విజయం సాధించారు. ఆల్బమ్ చివరలో ఈ పాట ఉన్నప్పటికీ అందరికీ నచ్చడంతో ముందు ఉంటుంది.

చివరగా…
సున్నితమైన అంశం కథాంశం అయినప్పుడు.. ఆ గీతలోనే స్వరాలూ ఉండాలి. ఆ విషయంలో మహతి వంద శాతం సక్సస్ అయ్యారు. రెండు పాటలు ఫరవాలేధనిపించినప్పటికీ.. మూడు పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా ఉన్నాయి. ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఆల్బమ్ హిట్టే. తెరపైన చూసిన తర్వాత మరింత నచ్చే ఆస్కారం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus