కొన్నిరోజుల క్రితం కోట శ్రీనివాసరావు టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కోట శ్రీనివాసరావును సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది. తాజాగా నట్టి కుమార్ సైతం కోట శ్రీనివాసరావు గురించి షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నట్టి కుమార్ మాట్లాడుతూ వారాహి యాత్ర ఎన్ని రోజులు అనేది తెలియదని ఆయన కామెంట్లు చేశారు.
సినిమాల షెడ్యూళ్లకు అనుగుణంగా పవన్ పొలిటికల్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారని నట్టి కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి కామెంట్లు చేయడం కోట శ్రీనివాసరావుకు ఎందుకని నట్టి కుమార్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా, నీతిగా ట్యాక్స్ కడుతున్నారని పవన్ తన లైఫ్ ను వదులుకుని మరీ ప్రజల కోసం పని చేస్తున్నారని నట్టి కుమార్ పేర్కొన్నారు. పవన్ ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి పారితోషికం గురించి రివీల్ చేశాడని ఆయన అన్నారు.
కోట శ్రీనివాసరావు ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి రెమ్యునరేషన్ వివరాలను చెప్పలేకపోతున్నాడని నట్టి కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మూడు షిఫ్ట్ లలో, నాలుగు షిఫ్ట్ లలో పని చేసిన రోజులు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ మీద ఏడవద్దని ఆయన పారితోషికం గురించి ఆయన చెప్పడంలో తప్పేం లేదని నట్టి కుమార్ పేర్కొన్నారు.
కోట శ్రీనివాసరావుకు వయస్సు అయిపోయిందని ఆయన హద్దుల్లో ఉంటే బెటర్ అని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ ను గెలిపించుకోలేకపోవడం మన అసమర్థత అని నట్టి కుమార్ (Natti Kumar) అన్నారు.