నాని… సుధీర్ బాబుల మధ్య గొడవకి కారణం అదేనంట …?

ప్రస్తుతం మన హీరోలు కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి రెడీ మక్కువ చూపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ‘బాలు’ మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’, జూ.ఎన్టీఆర్ ‘టెంపర్’ ‘జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. ఇటీవల మొదలైన హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ ల ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రనే పోషిస్తున్నాడట. ఇప్పుడు ఆ లిస్ట్ లో నేచురల్ స్టార్ నాని కూడా చేరిపోయాడని తెలుస్తుంది.

నాని ని హీరోని చేసింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ… ఇప్పుడు విలన్ గా మార్చబోతుంది కూడా ఆయనే. అసలు విషయంలోకి వెళితే… దిల్ రాజు నిర్మాతగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో ఓ మల్టీ స్టారర్ చిత్రం రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలో నాని ని ఫిక్స్ చేశారట. అయితే మరో హీరోకోసం చాలా కాలం నుండీ దర్శక నిర్మాతలు గాలిస్తున్నారు. ఇప్పుడు ఆ హీరోకూడా ఫైనల్ అయిపోయాడని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు… మన మహేష్ బావ సుధీర్ బాబే.. ! ‘సమ్మోహనం’ చిత్ర సమయంలో ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో మరో చిత్రం చేయాలనీ ఆశగా ఉందని సుదీర్ బాబు పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరనుందని తెలుస్తుంది. అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో నాని విలన్ షేడ్స్ ఉండే పాత్రలో నటించబోతున్నాడట.

సుధీర్ బాబు ఈ చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా నటిస్తుండగా .. నాని ఓ క్రిమినల్ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. ఇందులో నాని పాత్రే కీలకమని… ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఈ పాత్ర సాగుతుందని టాక్ వినిపిస్తుంది. నాని ని పట్టుకోవడానికి సుదీర్ బాబు వేసే ప్లాన్స్ కూడా ఆకట్టుకుంటాయట. గతంలో ‘జెంటిల్ మేన్’ చిత్రంలో కూడా కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న… కన్నింగ్ లుక్ తో బాగా ఆకట్టుకున్నాడు నాని. ఇక అదే ఫుల్ లెంగ్త్ ఉంటే…. ఈ నేచురల్ స్టార్.. థ్రిల్ చేయడం కాయమంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus