విలన్ గా మరో యంగ్ హీరో..!!

యువ హీరోలు పాత్ర నచ్చితే విలన్ గా నటించడానికి వెనుకాడడం లేదు. బాహుబలి లో రానా, సరైనోడు చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతి కథానాయకుడిగా మెప్పించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ బాటలో మరో యంగ్ హీరో నడిచేందుకు సిద్దమయ్యాడు. అందాల రాక్షసి సినిమాలో భగ్న ప్రేమికుడిగా కనిపించిన నవీన్ చంద్ర హీరోకి ఎదురెళ్లనున్నాడు.

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మాన్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాని సినిమాలో విలన్ గా నటించేందుకు నవీన్ చంద్ర ఒకే చెప్పినట్లు సమాచారం. సినిమా చూపిస్తా మామ మూవీ దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు చెప్పిన కథలో తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుందని ఉద్దేశంతో నవీన్ అంగీకరించారని తెలిసింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో “నేను శైలజ” హీరోయిన్ కీర్తి సురేష్ నాని తో జోడి కట్టనుంది. ఈ చిత్రానికి “నేను లోకల్” అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది. కొన్నేళ్లుగా నవీన్ చంద్ర హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అతను హీరో నటించిన భం బోలేనాథ్, త్రిపుర, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. విలన్ గా చేసే సినిమా తో నైనా హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus