రెండో సినిమాతో పరిచయం కానున్న సూపర్ స్టార్ వారసుడు

ఏమిటో ‘స్టార్’ వారసుల పరిస్థితి.. ఎన్నో ఆశలతో, ఎంతో కష్టపడి చేస్తున్న మొట్ట మొదటి సినిమా విజయం సాధించడం లేదన్నది కొందర్ని బాధిస్తుంటే, మరి కొందరి పరిస్థితి ఇంకా దారుణం. తెరవెనుక ఎంతమంది అందండలున్నా వారి తొలి సినిమా మాత్రం తెరమీదికి రావడం లేదు. దాంతో తొలి సినిమాతో వారు తెరకు పరిచయమైనా ప్రేక్షకులకి చేరువయ్యేది రెండో సినిమాతోనే. ఈ కోవకి చెందిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకడు. కాగా ఇప్పుడు అతని ప్రాణ స్నేహితుడు, సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ అదే లిస్ట్ లో చేరాడు.

నవీన్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. కృష్ణవంశీ దగ్గర శిష్యరికం చేసిన రామ్ ప్రసాద్ రగుతు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇంకా చెప్పాలంటే ‘శైలజ’గా తెలుగు ప్రేక్షకుల మదిలో తిష్ట వేసిన కీర్తి సురేష్ కి తెలుగులో తొలి సినిమా ఇదే. పలు కారణాలతో ఈ సినిమా పూర్తయినా ల్యాబ్ గోడల మధ్యనే మగ్గుతోంది. ఇదిలా ఉంటే నవీన్ నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమా ఫస్ట్ లుక్ నిన్న సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల విడుదల చేశారు. పివి గిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిత్య నరేష్, శ్రావ్య నాయికలు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ కుటుంబం నుండి వస్తున్న ఈ మూడోతరం హీరోకి కుటుంబ సభ్యుల మద్దతు మెండుగానే ఉంది. ఈ నెల 27న జరుగనున్న ఆడియోకి మహేశ్ బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారుట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus