సినిమాలపై ఆసక్తితో యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరో నవీన్ పోలిశెట్టి. ఒక్క సినిమా హిట్ పడగానే యంగ్ హీరోలు మాస్ ఎలేవేషన్స్ పై దృష్టి పెడ్తున్న ఈ రోజుల్లో సినిమా కథ, స్క్రిప్ట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ అహర్నిశలు దానిపైనే వర్క్ చేస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నవీన్ పోలిశెట్టి. రీసెంట్ గా సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి, అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ యంగ్ హీరో. నిన్న ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా, హీరో అవ్వటానికి తాను పడ్డ కష్టాలని పంచుకొని ఎమోషనల్ అయ్యాడు నవీన్.
ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే తనకు హీరో అవ్వాలనే కోరిక ఉండేదని తెలుపుతూ కానీ అది సాధ్యం అవ్వని పని అనుకుంటున్నప్పుడు తనకు కనపడ్డ మార్గదర్శి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. అలా చదువు పూర్తీ చేసుకుని సినిమాల్లో అవకాశాల కోసం యూట్యూబర్ గా ప్రయత్నాలు చేస్తూ, ముంబైలో ఆడిషన్స్ ఇస్తున్న టైంలో ఎంత తిరిగినా అవకాశాలు రాకపోవటం, చుట్టూ ఉన్నవారు యూట్యూబ్ నుంచి సినిమా హీరో అయిన వారు ఎవ్వరు లేరు అని నిరాశపరచే వారు అని చెప్పుకొచ్చారు.
అలా అలా వరుస ప్రయత్నాల ద్వారా హీరో అయ్యి తీసిన 4 సినిమాలు హిట్ అయ్యింది చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు నవీన్. చివరగా సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడటం ద్వారా కచ్చితంగా ఒకరోజు సక్సెస్ రుచి చూస్తామని చెప్పారు.