Navya Swamy: గేమ్ ఆడుతూ గాయాలు పాలైన నటి నవ్య స్వామి.. వీడియో వైరల్..!

బుల్లితెర పై ప్రసారమయ్యే గేమ్ షోలు బాగా పాపులర్ అవుతుంటాయి అన్న సంగతి తెలిసిందే. అందులోనూ సుమ, ప్రదీప్ వంటి స్టార్ యాంకర్లు హోస్ట్ చేసే షోలకి ఫ్యామిలీ ఆడియెన్స్ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఛానెళ్లలో ప్రసరమైనప్పుడు మాత్రమే కాదు.. యూట్యూబ్లో కూడా మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేస్తుంటాయి. సరే ఇప్పుడు మనం ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సూపర్ క్వీన్ షో గురించి మాట్లాడుకుందాం.

Click Here To Watch NOW

పలువురు బుల్లితెర నటీమణులతో కలిసి యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ.. వాళ్ళతో ఆడించే ఆటలు ఈ షోని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ సెమీ ఫైనల్ కు చేరుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేయగా ఇది కాస్త హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో నటి నవ్యస్వామి గాయాలు పాలయ్యింది. ఆమె చేతికి గాయం అవ్వడం రక్తం కారడం వంటివి ఈ ప్రోమోలో కనిపించాయి.

గేమ్ లో భాగంగానే ఇదంతా జరిగింది. ఓ టాస్క్ లో భాగంగా బుల్లితెర నటీమణులు తమ మోచేతులతో కూల్ డ్రింక్ బాటిల్స్ ను పగలగొట్టే టాస్క్ ఒకటి ఇచ్చారు. దీంతో ఈ భామలంతా తమ ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యారు. రెట్టింపు జోష్ తో ఈ టాస్క్ ను ఆడారు. ఆ సమయంలో నటి నవ్యస్వామి మోచేతికి గాయం అయ్యింది. తర్వాత రక్తం కూడా కారడంతో అక్కడున్న వారంతా కంగారు పడుతూ ఎమోషనల్ అయ్యారు.

నవ్య స్వామితో పాటు భాను శ్రీకి కూడా గాయాలయ్యాయి. ఇది నిజంగానే జరిగిందా లేక ప్రోమో కోసమే ఇలాంటివి యాడ్ చేసారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక నవ్య స్వామి.. తన సహనటుడు మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన రవి కృష్ణతో ప్రేమలో ఉన్నట్టు జరిగిన ప్రచారంతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus