నయనతారను అభిమానులు షార్ట్‌గా నయన్ అని పిలచుకుంటారు. సినిమాల్లో ఆమె నటకు ఫిదా అయినవాళ్లు, ఆమె పాత్రల ఎంపిక పట్ల బాగా క్లారిటీ ఉన్నవాళ్లు ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పిలుపు కోసం చాలామంది హీరోయిన్లు ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. అయితే ఇంతటి పేరు సంపాదించుకున్న నయనతార మాత్రం ఆ పేర్లలో ఒకటి తనకు ఏమాత్రం నచ్చలేదు అని చెబుతోంది. నయనతార ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది. 75 సినిమాలు చేసి సీనియర్ మోస్ట్ హీరోయిన్ అనిపించుకుంది.
ఈ క్రమంలో ఆమెను అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని అంటున్నారు. కానీ ఆ పేరు తనకు ఏ మాత్రం నచ్చదు అని నయన్ ఇటీవల చెప్పుకొచ్చింది. అంతేకాదు అలా పిలుస్తుంటే తనకెందుకో ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్పింది. అలా ఎందుకు అనుకుంటుందో కూడా తెలిపింది. ‘జవాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఇటీవల అదరగొట్టింది నయన్. ఇప్పుడు ‘అన్నపూరణి’ తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే తనను సూపర్ స్టార్ అని పిలవడంపై స్పందించింది.
చెప్పడం సరదాగానే చెప్పినా ఎందుకు అలా అంది అనే చర్చ మాత్రం కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. లేడీ సూపర్ స్టార్ అని నన్ను పిలవడం నాకు నచ్చదు. ఎవరైనా అలా పిలిస్తే నన్ను తిట్టినట్లు అనిపిస్తుంటుంది. గతంలోనే తనకు ఆ పేరు ఉన్నా… ‘జవాన్’ సినిమా తర్వాత చాలా మంది ఇదే పేరుతో పిలుస్తున్నారట. అదంతా వారి అభిమానం అవ్వొచ్చు. కానీ నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. అయితే ఇంతమంది ప్రేమాభిమానాలు సంపాదించాను అంటే…
అదంతా ఈ ఇండస్ట్రీ వల్లే అంటూ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడింది (Nayanatara) నయన్. ‘అన్నపూరణి’ సినిమా విషయానికొస్తే నయనతార 75వ సినిమా ఇది. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ప్రస్తుతం ఆమె ‘టెస్ట్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎస్.శశికాంత్ రూపొందిస్తున్నారు.