మిచౌంగ్ తుఫాను ప్రభావం చెన్నైతో పాటు చెన్నై తీర ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టాలను కలగజేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ తుఫాను ప్రభావం కారణంగా చెన్నైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది వాహనాల రాకపోకలు నిత్యవసరకులు కరెంటు పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు పూర్తిగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో సహాయక చర్యలు చేసినప్పటికీ బాధితులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు రంగంలోకి దిగి అభిమానుల ద్వారా వరద బాధితులకు పెద్ద ఎత్తున ఆహారం నిత్యవసర సరుకులు దుస్తులు వంటి వాటిని పంపిణీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీనటి నయనతార కూడా వరద బాధితులకు తన వంతుగా సహాయం చేశారు అయితే ఈమె వరద బాధితులకు సహాయం చేసిన పలువురు ఈమె చేసిన పని పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. వరద బాధితులకు దుస్తులు నిత్యావసర సరుకులు ఇతర సరుకులను పంపిణీ చేయాలి అంటే ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది
అయితే నయనతార (Nayanatara) మాత్రం తన ఫెమి 9 కంపెనీ వాహనాల ద్వారా వరద బాధితులకు కావలసినటువంటి నిత్యవసర సరుకులను అందులో పంపించి అందరికీ అందేలా చేశారు. ఇలా వరద బాధితులకు నిత్యవసర సరుకులతో పాటు కాస్మెటిక్స్ అలాగే దుస్తులు లాంటివి నయనతార వరద బాధితులకు అందజేశారు. ఈ విధంగా వరద బాధితులకు తన వంతు సహాయం చేస్తున్నటువంటి నయనతార పట్ల ఎంతోమంది ప్రశంశలు కురిపించగా మరి కొందరు మాత్రం విభిన్న ధోరణిలో ఆలోచించి ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఆపద సమయంలో ప్రజలు ఉండగా నయనతార మాత్రం సహాయం పేరిట తన కంపెనీని ప్రమోట్ చేసుకుంటున్నారు అందుకే తన కంపెనీ ఫ్లెక్సీలో ఉన్నటువంటి వాహనాలలో నిత్యవసర సరుకులను పంపించి ఇలాంటి సమయంలో కూడా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. కానీ చాలామంది నయనతారకు మద్దతుగా నిలిచారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!