అమ్మగా నటించడానికి సిద్ధమైన నయన తార
- June 6, 2017 / 07:38 AM ISTByFilmy Focus
పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న సుందరి నయనతార. ఈ కేరళ బ్యూటీకి వయసు పెరిగే కొద్దీ గ్లామర్ మరింత పెరుగుతోంది. ఒక వైపు యువ హీరోల పక్కన సినిమాలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విజయాలను అందుకుంటోంది. అలా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నయన తార సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిగా నటించడానికి ఒప్పుకుంది. ఇది వరకు తులసి సినిమాలో అమ్మగా కనిపించిన ఈమె.. తొలిసారి ఫుల్ లెన్త్ తల్లి క్యారక్టర్ రోల్ పోషించడానికి సిద్ధమైంది. తమిళంలో తెరకెక్కుతోన్న ‘ఇమైకా నోడిగళ్’ సినిమాలో నయన తార సీబీఐ అధికారిణిగా కనిపించనుంది. అయితే ఆ పాత్రకు నాలుగేళ్ల పాప ఉంటుంది. తల్లీ కూతుళ్ళ మధ్య సన్నివేశాలు సినిమాలో కీలకం కానున్నాయి.
మరో హీరోయిన్ త్రిష కూడా తల్లిగా నటించడానికి సై అంటోంది. ప్రస్తుతం అరవింద్ స్వామి సరసన త్రిష ‘శతురంగ వేట్టై’ సినిమా చేస్తోంది. ఇందులో ఆమె నాలుగు సంవత్సరాల పిల్లకి తల్లిగా నటిస్తోంది. స్టార్ హీరోయిన్స్ ఈ తరహా పాత్రలను తీసుకోవడం వెనుక కొత్తదనం దాగుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












