హీరోయిన్ గా సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తోంది. కొత్త ప్రియుడితో యూఎస్ ట్రిప్ లకు కూడా వెళ్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇన్ని ఉన్న నయనతార డ్రగ్స్ అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?. అందుకే కంగారు పడకుండా ఈ ఆర్టికల్ ను కాస్త శ్రద్ధగా చదవండి. నయనతార నటిస్తున్న తాజా చిత్రం “కోకో”. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్ లో నయనతార టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. దిగుమ మధ్య తరగతి యువతిగా ఈ చిత్రంలో నయనతార కనిపించనుంది.
ఈ చిత్రంలో నయనతార ప్రవృత్తి డ్రగ్స్ అమ్మడం. కాలేజ్ లో చదువుతూనే డబ్బు కోసం కాలేజ్ బ్యాగ్ లోనే డ్రగ్స్ మోసుకెళ్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఆ డ్రగ్స్ ను కాలేజ్ స్టూడెంట్స్ కి అమ్మి వచ్చిన సొమ్ములో షేర్ తీసుకునే పాత్రట. అయితే.. మునుపటి చిత్రమైన “అర్రమ్” (తెలుగులో “కర్తవ్యం”)లో బాధ్యతగల కలెక్టర్ గా నటించిన నయనతార ఇప్పుడు ఇలా డ్రగ్స్ అమ్మే అమ్మాయిగా నటించడం అనేది ఎంతవరకూ కరెక్ట్ అని కొన్ని తమిళ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే.. సినిమాలో ఒక డ్రగ్స్ అమ్మే అమ్మాయి అదే డ్రగ్స్ అమ్మే వ్యవస్థను ఎలా నాశనం చేసింది అనేది కీలకాంశం అని, ఈ సినిమా వల్ల యువత ఆలోచనా విధానం మెరుగుపడుతుండే తప్ప తప్పుడుదారి పట్టే అవకాశం లేదని చెబుతున్నాడు చిత్ర దర్శకుడు.