భారీ కలక్షన్స్ సాధిస్తున్న నయనతార మూవీ

Ad not loaded.

అందం, అనుభవం కలిగిన నయనతార ఓ వైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే.. లేడీఓరియేంటేడ్ సినిమాలతో దూసుకుపోతోంది. రెండు విభాగాల్లో విజయాన్ని సొంతంచేసుకోవడం ఆమెకే సాధ్యమవుతోంది. వరుస విజయాలతో దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ జాబితాలో ముందు వరుసలో స్థానం సంపాదించుకున్న ఆమె తాజాగా చేసిన తమిళ సినిమా “కొలమావు కోకిల”. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 17వ తేదీన తమిళనాడులో విడుదలయి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో ఆర్ధిక ఇబ్బందుల్లో నుంచి బయటపడటానికి డ్రగ్స్ అమ్మడానికి సిద్ధపడ్డ అమ్మాయిగా నయన మంచి నటన కనబరిచింది. అందుకే తమిళ స్టార్ హీరోలైన అజిత్‌, విజయ్‌ సినిమాల మాదిరిగా ఈ సినిమాకి ప్రత్యేక షోలు వేశారు.

అంతేకాకుండా విడుదలైన మరుసటి రోజే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌లు సినిమాని చూసి ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఈ సినిమాని చూసేందుకు సినీ ప్రేమికులు ఎగబడతున్నారు. ఈ మూవీ పది రోజుల్లో 20 కోట్ల కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. లేడీఓరియేంటేడ్ మూవీ ఈ రేంజ్ లో కలక్షన్స్ సాధించడం ఇదే తొలిసారని సినీ విశ్లేషకులు చెప్పారు. ఆ విభాగంలో నయనతార అనేక రికార్డులను నెలకొల్పిందని తెలిపారు. ఈ మూవీ తెలుగులో “కోకోకోకిలా” అనువాదమై త్వరలోనే విడుదల కానుంది. మరి ఇక్కడ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus