Nayanthara: ఐశ్వర్యారాయ్ బాటలో నయన్.. చెట్టుతో పెళ్లి?

సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ గా నయనతార పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికే విఘ్నేష్ నయన్ లకు నిశ్చితార్థం జరగడంతో త్వరలోనే విఘ్నేష్, నయన్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను చెబుతారని అభిమానులు భావిస్తున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావించి నయన్, విఘ్నేష్ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు.

అయితే నయనతార జాతకంలో కుజ దోషం ఉందని సమాచారం. దోష పరిహారం కోసం నయనతార మొదట చెట్టును వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. పండితుల సూచనల మేరకు నయన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ వార్త గురించి నయనతార స్పందించి స్పష్టత ఇస్తే మాత్రమే నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. గతంలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ కూడా మొదట చెట్టును వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యా రాయ్ ల వివాహం జరిగింది.

నయనతార కూడా ఐశ్వర్యా రాయ్ ను ఫాలో అవుతున్నారంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మరోవైపు నయనతార కీలక పాత్రలో నటించిన కాతు వాకుల రెండు కాదల్ సినిమా దీపావళికి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో నయనతార ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. నయనతారతో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సమంత నటిస్తుండటం గమనార్హం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus