Nayanthara: ఆ లేడీస్‌ హాస్టల్‌ స్టూడెంట్స్‌ చాలా లక్కీ కదా…

నయనతార ఓ సినిమాను ఓకే చేసినప్పుడు అగ్రిమెంట్‌ ‘నో ప్రమోషన్స్‌’ అనే క్లాజు ఉంటుంది అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… ఆమె అయితే ఎంత పెద్ద సినిమా అయినా, ఎవరు పిలిచినా ప్రమోషన్స్‌కు రాదు, రాలేదు కూడా. అయితే ఇప్పుడిప్పుడే నయన్‌ ఆలోచనలు మారాయా? లేక కొన్ని సినిమాల విషయంలో రిలాక్సేషన్‌ ఇచ్చిందా అనేది తెలియదు కానీ… ప్రమోషన్లకు నయనతార వస్తోంది. అది జనాల మధ్యలోకి.

వినడానికి, చూడటానికి బాగున్నా… నమ్మకడానికి అంత ఈజీగా ఉండని ఈ విషయం జరిగింది. నయనతార ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘అన్నపూరణి’. ఈ సినిమా ప్రచారం కోసం నయనతార వచ్చింది. అది కూడా జనాల మధ్యలోకి. ఈ క్రమంలో ఆమెను చూసిన విద్యార్థినిలు సర్‌ప్రైజ్‌ అయ్యారు. స్టూడెంట్స్‌ ఎందుకు సర్‌ప్రైజ్‌ అవుతారు అనుకుంటున్నారా? ఎందుకంటే నయన్‌ ప్రచారానికి వచ్చింది ఓ లేడీస్‌ హాస్టల్‌కి కాబట్టి.

అందరూ భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో వచ్చిన (Nayanthara) నయన్‌ను చూసి విద్యార్థినులు ఒక్కసారిగా ఆనందంతో కేరింతలు కొట్టారు. వాళ్లతో ఆమె సరదాగా మాట్లాడడమే కాకుండా స్వయంగా బిర్యానీ వడ్డించింది. దీంతో ఆ రోజు వారి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మారింది అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదంతా నయనతార, జై ప్రధాన పాత్రల్లో నటించిన ‘అన్నపూరణి’ సినిమా కోసమే.

నీలేశ్‌ కృష్ణ తెరకెక్కించిన ఈ తమిళ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో నయన్‌, హీరో జై చెన్నైలోని ఓ లేడీస్‌ కాలేజ్‌కి వెళ్లారు. అక్కడ లంచ్‌ టైమ్‌లో ముచ్చటించి, బిర్యానీ వడ్డించి వావ్‌ అనిపించారు. దీంతో తాను నటించిన ఏ సినిమా ప్రచారానికీ బయటకు రాని నయనతార ఇప్పుడిలా బయటకు రావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. మామూలుగా అయితే భర్త విఘ్నేశ్‌ శివన్‌ సినిమాల్లో నటిస్తే ప్రచారానికి వచ్చేది. అది కూడా ఇంటర్వ్యూల వరకే.

కానీ ‘అన్నపూరణి’ కోసం ఎందుకు వచ్చింది అనేది ఆసక్తికరం. అయితే ఈ సినిమా ఆమెకు 75వ చిత్రమని, ఆ స్పెషల్‌ నెంబర్‌ వల్లే వచ్చింది అని అంటున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుంది అనేది కథ.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus