సోషల్ మీడియాలో ఒక్కోసారి చిన్న నిప్పు రవ్వే పెను దావానలంలా మారిపోతూ ఉంటుంది. స్టార్స్ విషయంలో ఆ వేగం ఊహకు కూడా అందదు. సౌత్ ఇండియా స్టార్ కపుల్ నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. వీరిద్దరి బంధం క్లైమాక్స్ కి వచ్చేసిందని, పెళ్లి బంధానికి బీటలు వారాయని ఓ టాక్ మొదలైంది. కాసేపటికే ఇది ట్రెండ్ అయిపొయింది. ‘బుద్ధి లేని వాడిని పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మగాళ్లు ఎప్పటికీ ఎదగరు, వాళ్లు చేసే పనులకు మనం బాధ్యత వహించలేం. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.
మీ అందరితో నాకు విసుగొచ్చింది’ అని నయనతార (Nayanthara) సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టినట్టు ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దీంతో నయన్‌కు విఘ్నేష్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి, అవి తారాస్థాయికి చేరాయి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇది ఫేక్ పోస్ట్ అని తెలీక చాలా మంది నిజమని నమ్మేసి విఘ్నేష్ శివన్..ను టార్గెట్ చేసి విమర్శించడం మొదలుపెట్టారు. నయనతార లాంటి స్టార్..ను బాధపెట్టావంటూ అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే వీరి బంధం ముగిసిపోయిందంటూ కథనాలు పుట్టిస్తున్నారు.
అయితే, ఈ ప్రచారంలో నిజం లేదు.అది ఫేక్ పోస్ట్..! పూర్తిగా కల్పితం, పచ్చి అబద్ధం. నయనతార (Nayanthara) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అలాంటి స్టోరీ పెట్టనే లేదు. కొందరు ఆకతాయిలు, ఈ జంటపై గిట్టని వారు కావాలనే ఎడిటింగ్ ఫోటోని పోస్ట్ చేసి, ఈ దారుణమైన రూమర్ క్రియేట్ చేశారు. అన్యోన్యంగా సాగిపోతున్న వీరి కాపురంలో నిప్పులు పోయడానికే ఇలాంటివి సృష్టిస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.