మలయాళంలో మరో సినిమా సైన్ చేసిన నయనతార.!
- April 18, 2018 / 05:46 AM ISTByFilmy Focus
గ్లామర్ హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా, అంతకు మించిన నటిగా గుర్తింపుతోపాటు స్టార్ డమ్ కూడా సొంతం చేసుకొన్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతకుమునుపు హీరోల సరసన నటించడానికి మాత్రమే మొగ్గుచూపిన నయనతార గత రెండు మూడేళ్లుగా కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ తన నట ప్రతిభను ఘనంగా చాటుకొన్న విషయం తెలిసిందే. ఇటీవల నయనతార నటించిన “కర్తవ్యం” (తమిళంలో “అరమ్”) తెలుగులోనూ ఘన విషయం సాధించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా విజయం ఇచ్చిన స్పూర్తితో నయనతార ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్ లో నటించడానికి సన్నద్ధమవుతోంది. అయితే.. ఈసారి తమిళంలో కాక తన కథానాయికా ప్రస్థానానికి కేంద్రమైన మలయాళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్ చేయనుంది. మహేష్ వెట్టియార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార వైవిధ్యమైన పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర స్వభావం నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఉండబోతోందని మాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే.. నయనతార ప్రస్తుతం చిరంజీవి సరసన కథానాయికగా “సైరా నరసిమహ రెడ్డి” చిత్రంలో నటిస్తోంది.
















