బ్లాక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నయనతార

సౌత్‌లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవ‌రంటే న‌య‌న‌తార అని ఠ‌క్క‌న చెప్పేస్తారు. తెలుగు, త‌మిళంలో వ‌రుస ప్రాజెక్టులు చేస్తూ అంద‌రికి షాక్ ఇస్తుంది న‌య‌న్. ఇటీవ‌ల బాల‌య్య స‌ర‌స‌న జై సింహా అనే చిత్రంలో న‌టించిన న‌య‌న‌తార త్వ‌ర‌లో సైరా టీంతో క‌ల‌వ‌నుంది. అయితే ప్ర‌స్తుతం నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కోకో అనే సినిమా చేస్తుంది. లైకా ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని మార్చి 5న‌, సింగిల్ ట్రాక్‌ని మార్చి 8న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

బ్లాక్‌ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కోకో అంటే కోలమావు కోకిల అని తెలుస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ ఫిలింగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని యూనిట్ చెబుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus