‘మైత్రీ’ భలే ప్లాన్‌… ఆ స్టార్‌ హీరోయిన్‌తో సినిమా… ఎప్పుడంటే?

  • January 7, 2024 / 01:45 PM IST

టాలీవుడ్‌లో ఆ మాటకొస్తే సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో ‘హీరో’యిన్లు అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వారిలో నయనతార ఒకరు. చాలా ఏళ్లుగా కథానాయిక ప్రాధాన్య చిత్రాలను చేస్తూ ముందుకెళ్తోంది నయన్‌. అయితే మధ్య మధ్యలో సగటు కమర్షియల్‌ సినిమాలు కూడా చేస్తుంటుంది. అయితే ఇప్పుడు మరోసారి నాయికా ప్రాధాన్య చిత్రానికి ఓకే చెప్పింది అని అంటున్నారు. అందులో కొత్తేముంది అంటున్నారా? దాని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌.

టాలీవుడ్‌లో అగ్ర స్టార్‌ హీరోలు, కుర్ర స్టార్‌ హీరోలు, కుర్ర హీరోలు, కొత్త వాళ్లు… ఇలా అన్ని రకాల సినిమాలను చేస్తూ స్టార్‌ ప్రొడక్షన్‌ హౌస్‌గా నిలిచింది మైత్రీ మూవీ మేకర్స్‌. ఇప్పుడు ‘హీరో’యిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేసి ఆ జోనర్‌లో కూడా తన ముద్ర వేయాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే నయనతారతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ మేరకు ఆమెకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్‌ అంటున్నారు.

మామూలుగానే నయనతార రెమ్యూనరేషన్‌ ఎక్కువ అంటుంటారు. స్టార్‌ హీరోయిన్లలో ఆమె రెమ్యూనరేషనే ఎక్కువ అని ఓ టాక్‌ ఉంది. ఇప్పుడు ‘హీరో’యిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అంటే.. ఇంకాస్త ఎక్కువగానే అందుకుంటుంది. దానికి సిద్ధమయ్యే మైత్రీ టీమ్‌ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిందట. అయితే ఈ కథ ఏ జోనర్ కి సంబంధించినది? దర్శకుడు ఎవరు? సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది లాంటి వివరాలు పెద్దగా బయటకు రాలేదు.

అయితే ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఇటీవల ఓ హీరోయిన్‌ ఓరియెటెండ్‌ కథను సిద్ధం చేశారని టాక్‌ నడుస్తోంది. ఆ సినిమాలో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని అనుకుంటున్నారని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు మైత్రీ టీమ్‌ ఆ దర్శకుడితోనే నయనతార సినిమా చేస్తుందా అనే చర్చ ఒకటి సోషల్‌ మీడియాలో మొదలైంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా మీద క్లారిటీ వస్తుంది అంటున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus