అందాల భామ నయన తార, టాలీవుడ్ లో దాదాపుగా అందరి టాప్ హీరోస్ తో సినిమాలు చేసి, కరియర్ మంచి పీక్స్ లో ఉన్న క్రమంలో ప్రభుదేవతో ప్రేమాయణం సాగించింది. పోనీ అదైనా నిలబెట్టుకుందా అంటే అదే లేదు…..ఏమయిందో ఏమో కానీ…మొత్తానికి ప్రభును పక్కకు నెట్టి మళ్ళీ సినిమాల బాట పట్టింది. ఇదిలా ఉంటే తెలుగులో దాదాపుగా ‘శ్రీరామ రాజ్యం’ సినిమా ఆమె ఆఖరి సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ట్విస్ట్ ఇచ్చి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కట్ చేస్తే…సూపర్ డూపర్ హిట్స్ తో దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఈ భామ తమిళంలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చాలామణీ అయిపోతుంది. వయసు మొప్పై ఏళ్లు దాటినా…వరుసగా సినిమాలు భారీ హిట్స్ గా నిలవడంతో నిర్మాతలకు అందని ద్రాక్షగా తయారయింది. ఇంతకీ విషయం ఏంటంటే…తమిళంలో వరుస హిట్స్ లో దూసుకుపోతున్న నయనకు ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఇప్పటికీ 2.5కోట్లు రెమ్యునిరేషన్ తీసుకుంటూ ఉండడం, అంతేకాకుండా వచ్చే నిర్మాతలకు దాదాపుగా 4కోట్ల పారితోషకం అడగడం చేస్తూ ఉండడం చూసి నిర్మాతలు పారి పోతున్నారు. తాజాగా ఒక ముగ్గురు నిర్మాతలు ఆమెను తమ సినిమాలో నటించేందుకు అడగడానికి వెళ్ళగా…4కోట్లకు ఒక్క రూపాయి తగ్గినా ఒప్పుకునేది లేదు అని ఆమె చెప్పడంతో ఖంగుతిన్న నిర్మాతలు నీకో నమస్కారం నయన…వేరే వారిని చూసుకుంటాంలే అని వెళ్ళిపోయారంట. బహుశా నయనతార లేట్ వయసుకు దగ్గర అవుతుంది కదా, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది పాపం.