Nazriya Remuneration: ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న నజ్రియా!

  • June 13, 2022 / 06:13 PM IST

నాని, నజ్రియా జంటగా నటించిన అంటే సుందరానికి సినిమా ఫస్ట్ వీకెండ్ లో 14.90 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. వీక్ డేస్ లో ఈ సినిమా కొన్ని ఏరియాల్లో బాగానే కలెక్షన్లను సాధిస్తుండగా మరికొన్ని ఏరియాలలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా కోసం నజ్రియా కూడా భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంటే సుందరానికి మూవీ కోసం నజ్రియాకు 2 కోట్ల రూపాయలు పారితోషికంగా దక్కిందని సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఏ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారో నజ్రియా కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఇతర హీరోయిన్లకు నజ్రియా రెమ్యునరేషన్ విషయంలో గట్టి పోటీని ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు అంటే సుందరానికి సినిమాలో నజ్రియా నటన గురించి ప్రేక్షకుల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నజ్రియాకు తెలుగులో కొత్త ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించాలని నజ్రియా భావిస్తున్నా ఆమెకు తెలుగులో కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. నజ్రియా ఫేస్ లో గ్లో మిస్ అయిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంటే సుందరానికి మూవీ తుది ఫలితం తేలాలంటే సెకండ్ వీకెండ్ వరకు ఆగాల్సిందే. నాని నటిస్తున్న సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంలో ఈ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.

నాని కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తర్వాత సినిమాలతో నానికి సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. ఒక్కో సినిమాకు నాని 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus