‘బాలయ్య 106’ కి.. ఆ టైటిల్ నే ఫిక్స్ చేసారా?

గతేడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 3 సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో బాలయ్య తరువాతి సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజున విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఈ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి అనే చెప్పాలి. అందులోనూ గతంలో బలయ్య- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన.. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి.కాబట్టి ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి టైటిల్ ఏం పెట్టారు? అనే విషయం పై మాత్రం ఇంకా నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. ‘మోనార్క్’ అనే టైటిల్ ఈ చిత్రానికి పెట్టినట్టుగా తెగ ప్రచారం జరుగుతుంది.

ఇదే టైటిల్ కనుక ఫిక్స్ చేస్తే.. అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. టీజర్లో బాలయ్య యాటిట్యూడ్ చూస్తుంటే.. ‘మోనార్క్’ అనే టైటిల్ యాప్ట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇందులో బాలయ్య మేనరిజమ్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయని టాక్ నడుస్తుంది. మరి అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి..!

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus