బాలకృష్ణ చిత్రానికి ఎన్టీఆర్ ‘టెంపర్’ ఛాయలు..!

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ‘రూలర్’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారట. కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుంటారని తెలుస్తుంది. బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కాదు… ‘టెంపర్’ లో ఎన్టీఆర్ లా ఓ నెగిటివ్ కాప్ గా కనిపించబోతున్నాడట. ఇంటర్వెల్ కి సిన్సియర్ పోలీస్ గా మారి.. విలన్ పని పడుతుంటాడట.

మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా ఈ చిత్రంలో బలయ్య క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేసాడట కె.ఎస్. రవికుమార్. ఇక ఈ చిత్రంలో విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడట. ‘లెజెండ్’ చిత్రంలో వీరిమధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈసారి కూడా అదే రేంజ్లో వీరి మధ్య సీన్లు పండుతాయని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో జగపతి బాబు కూడా యాడ్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెరిగింది. మరి ‘లెజెండ్’ లానే ఈ చిత్రం కూడా సూపర్ హిట్టవుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus