#NBK107.. బాలయ్య కొత్త సినిమా షూటింగ్ షురూ!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈరోజు నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల ఏరియాలో షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇందులో బాలయ్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.

Click Here To Watch

ఈ సీన్స్ కి రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. కొన్నిరోజుల పాటు ఈ లొకేషన్ లోనే చిత్రీకరించి.. తరువాత హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది దసరాకి సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ పోషించారు.

దీంతో ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పైగా ‘క్రాక్’ లాంటి హిట్ సినిమా తరువాత ఆయన డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో బిజినెస్ పరంగా కూడా సినిమాకి కలిసి రావడం ఖాయం. వేటపాలెంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్‌ నటించనుంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus