NBK107: కర్నూల్ లో బాలయ్య, శృతి హాసన్ ల సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. #NBK107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు.ఆల్రెడీ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. నవీన్ చంద్ర కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ను కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్‌లో నిర్వహించారు. సీడెడ్ ఏరియాల్లో బాలకృష్ణ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఓ సందర్భంలో అలీ కూడా సీడెడ్ లో బాలయ్య కింగ్ అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.ఇక #NBK107 షూటింగ్ చూడటానికి కూడా జనాలు ఓ రేంజ్లో తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను యాంకర్ సోనియా చౌదరి, సీరియల్ ఆర్టిస్ట్ మీనా కుమారి తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. లేటెస్ట్ షెడ్యూల్ లో వారు కూడా పాల్గొన్నారు. బాలయ్యతో తీసుకున్న సెల్ఫీలు కూడా వారు షేర్ చేశారు. ఇందులో హీరోయిన్ శృతి హాసన్,రజిత, దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఉండడం గమనార్హం. ఆ ఫొటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus