Shaakuntalam: శాకుంతలంలో తారక్.. నీలిమ గుణ స్పందన ఇదే.!

  • April 5, 2023 / 03:49 PM IST

స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన శాకుంతలం మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై ఊహించని రేంజ్ లో అంచనాలు పెంచుతున్నారు. దిల్ రాజు గారు ఈ సినిమాను ఎంతగానో నమ్మారని ఆమె వెల్లడించారు. ఈ సినిమాకు అంత పెద్ద సెట్స్ వేయడం సులువు కాదని సమంత నుంచి ఎంతో సపోర్ట్ లభించిందని నీలిమ గుణ అన్నారు..

ఈ సినిమా (Shaakuntalam) కోసం సమంత ఎంతో కష్టపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. మోహన్ బాబు గారితో పని చేయాలని చాలా సందర్భాల్లో నాన్న అనుకున్నారని ఈ సినిమాతో ఆ కల తీరిందని నీలిమ గుణ వెల్లడించారు. అల్లు అర్హ బార్న్ స్టార్ అని నీలిమ గుణ చెప్పుకొచ్చారు. భరతుని పాత్రకు అర్హ బాగుంటుందని భావించామని ఆమె కామెంట్లు చేశారు. అందరి హృదయాల్లో భరతుడిగా అర్హ నిలిచిపోతుందని నీలిమ గుణ చెప్పుకొచ్చారు.

అర్హకు వర్క్ షాప్స్ కండక్ట్ చేశామని ఆమె కామెంట్లు చేశారు. మూడు నెలల పాటు ట్రైన్ చేశామని నీలిమ కామెంట్లు చేశారు. అర్హ సన్నివేశాలు క్యూట్ గా వచ్చాయని ఆమె అన్నారు. నాకు వేరే వాళ్లతో కూడా నిర్మాతగా సినిమాలు చేయాలని ఉందని నీలిమ గుణ వెల్లడించడం గమనార్హం. గుణశేఖర్ టైమ్ తీసుకున్నా మంచి సినిమాతో వస్తారని అందరూ భావిస్తారని ఆమె అన్నారు.

తారక్ తో సినిమా చేయాలని ఉంటుందని నీలిమ గుణ పేర్కొన్నారు. తారక్ గురించి గొప్పగా నాన్న చెప్పేవారని ఆమె తెలిపారు. నా ఫేవరెట్ హీరో ఎవరూ అని చెప్పలేనని ఒక్కో హీరోలో ఒక్కో లక్షణం ఇష్టమని నీలిమ గుణ అన్నారు. శాకుంతలంలో జూనియర్ ఎన్టీఆర్ ను అడగలేదని ఆమె కామెంట్లు చేశారు. దుశ్యంతుడి పాత్ర పరిమితం కావడంతో ఎన్టీఆర్ ను ఈ సినిమా కోసం పరిశీలించలేదని తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus