Neelima Guna: చై-సామ్‌ విడాకులపై స్పందించిన ‘శాకుంతలం’ నిర్మాత!

సమంత – నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అయితే శుక్రవారం సాయంత్రం మాత్రం సమంత ఓ ట్వీట్‌ చేసింది. అందులో ‘అందరూ ఈ విషయంలో నన్ను నిందిస్తున్నారు, నేను ఎప్పుడూ పిల్లలు వద్దనుకోలేదు, నా తప్పేం లేదు, నాకు ఎలాంటి అఫైర్స్‌ లేవు…’ ఇలా తన వెర్షన్‌ చెప్పుకొచ్చింది. దానికి బలం చేకూరుస్తూ… ‘శాకుంతలం’ నిర్మాత నీలిమా గుణ మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే…

విడాకుల విషయంలో ఎవరు ముందుకొచ్చారు అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ… కొన్ని కారణాల వల్ల నెటిజన్లు సమంతదే తప్పు అంటూ ఉన్నారు. కొంతమంది నాయికలు సమంత తప్పు లేదు అని చెప్పారు. ఇదే విషయం నీలిమ గుణ దగ్గర ప్రస్తావిస్తే… ‘‘శాకుంతలం’ కోసం సమంతను సంప్రదించాం. అయితే అప్పటికే ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యింది. ఎందుకు అని అడిగితే…. ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉన్నానని చెప్పింది. అయితే మా సినిమా పీరియాడిక్ కథ అని చెప్పడంతో… విని ఓకే చేసింది’’ అని చెప్పారు నీలిమ గుణ.

ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉండటం వల్ల.. సమంత ఆ సినిమాను ఒప్పుకోవడానికి కొన్ని కండిషన్లు పెట్టిందట. సినిమా వీలైనంత త్వరగా పూర్తవ్వాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇదే నా ఆఖరి సినిమా. చాలా రోజులు గ్యాప్‌ తీసుకోవాలి అనుకుంటున్నా అని నీలిమ గుణకు సమంత చెప్పిందట. అందుకు తగ్గట్టే ‘శాకుంతలం’ సినిమాను వేగంగా పూర్తి చేశారట. ఈ నేపథ్యంలో ‘సమంత పిల్లల్ని వద్దనుకుంది’ అంటూ ఎవరో చేసిన స్టేట్‌మెంట్‌ తప్పని తేలిపోయింది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus