‘పద్మ’ అవార్డుల సెగ రాజుకుంటుందా???

  • January 28, 2017 / 06:30 AM IST

ప్రతీ రంగంలో ప్రతిభావంతులు ఉంటారు…అయితే వారి ప్రతిభను గుర్తిస్తూ…వారు ఆయాం రంగానికి చేసిన సేవలను గౌరవిస్తూ…వారికి ప్రభుత్వం తరపున గుర్తింపుగా అందించే అవార్డ్స్ ‘పద్మ’అవార్డ్స్. అయితే అదే క్రమంలో ప్రతీ సారి ప్రకటించే పద్మ అవార్డ్స్ లో ఎవరికో ఒకరికి అన్యాయం జరుగుతుంది అంటూ మనం వింటూనే ఉన్నాం…అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులు  సైతం వివాదానికీ వేదికగా మారాయి…ఇంతకీ ఏంటి ఆ వివాదం అంటే….మీరే చదవండి…సినిమా రంగంలో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అద్భతమైన పాటలు అందించారని వాపోతున్నారు కొందరు సినిమా ప్రముఖులు. తనదైన సాహిత్యం తో తెలుగు సినిమా రంగంలో చెరగని ముద్ర వేసాడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇంత అన్యాయం జరగడం నిజంగా బాధాకరం అని అంటున్నారు.

ఆయన ప్రతిభకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవం ఇదేనా అన్న మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది….ఇక ఆర్పీ పట్నాయక్ అయితే ఇదే విషయమై మాట్లాడుతూ…”తనదైన సాహిత్యం తో తెలుగు సినిమా రంగంలో చెరగని ముద్ర వేసాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి,  కానీ ఆయన ప్రతిభకు తెలుగు రాష్ట్రాల్లో ఫలితం దక్కకుండా పోయిందని ఆయనకు చాలా అన్యాయం జరిగిందన” అని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఒకరికిస్తే…మరొకరిణి విస్మరించినట్లే అన్న ఆలోచనలో ఉన్నారు పెద్దలంతా….ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే…ఈ విషయంపై సిరివెన్నల సీతారామశాస్త్రీ మాత్రం పెదవి విప్పకపోవడం…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus