Hanu Man OTT: ఫేక్ ప్రొఫైల్స్ తో హనుమాన్ పై నెగిటివ్ కామెంట్స్.. కావాలనే చేస్తున్నారా?

తేజ సజ్జా (Teja Sajja)  ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబోలో తెరకెక్కిన హనుమాన్ (HanuMan) మూవీ ఈ ఏడాది థియేటర్లలో విడుదలై కలెక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టించింది. ఓటీటీ వెర్షన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూడగా ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో సైతం అందుబాటులోకి వచ్చింది. అయితే హనుమాన్ తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంతమంది నుంచి ఈ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్ తో హనుమాన్ మూవీ గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

హనుమాన్ మూవీ గురించి ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేయడం ఇదే తొలిసారి కాదు. సినిమా రిలీజైన సమయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయగా ఆ సమయంలో ప్రశాంత్ వర్మ ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. కొంతమంది కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అద్భుతమైన గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సినిమాలను థియేటర్లలో చూడటానికి, ఓటీటీలో చూడటానికి తేడా ఉంటుంది.

కొంతమంది హనుమాన్ మూవీ స్థాయిని తగ్గించాలని ప్రయత్నిస్తున్నా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని జీ5 యాప్ లో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉందని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ వేదికగా ఈ సినిమా చూస్తూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. హనుమాన్ మూవీ వేర్వేరు భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ భవిష్యత్తు సినిమాలు బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో ప్రశాంత్ వర్మ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ గతంతో పోలిస్తే భారీ స్థాయిలో పెరిగింది. రాబోయే రోజుల్లో బాలయ్య (Balakrishna) ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని భోగట్టా.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus