Varasudu Movie: ‘వారసుడు’పై ఎఫెక్ట్ పడేలానే ఉంది!

ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల్లో ‘వారసుడు’ ఒకటి. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. సాధారణంగా అయితే తమిళ అనువాద సినిమాలు సంక్రాంతికి నామమాత్రంగా రిలీజ్ అవుతుంటాయి. రజినీకాంత్, సూర్య లాంటి ఫాలోయింగ్ ఉన్న హీరోలకు కూడా పొంగల్ టైంలో రిలీజ్ అంటే తెలుగులో కష్టమవుతుంది. కానీ విజయ్ కి ఇక్కడ సరైన ఫాలోయింగ్ లేదనే చెప్పాలి.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కడం వలన డబ్బింగ్ వెర్షన్ ను పెద్ద ఎత్తున రిలీజ్ చేయగలుగుతున్నారు. ఈ విషయంలో దిల్ రాజు ఎంత వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రిజల్ట్ ఏమాత్రం అటు ఇటు అయినా.. దిల్ రాజుని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం ఖాయం. థియేటర్ల గొడవ కారణంగా ‘వారసుడు’ సినిమా మీద ఎక్కడా లేని ఫోకస్ ఏర్పడింది. సినిమా చూడాలనే ఆసక్తి కంటే.. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆతురత జనాల్లో కనిపిస్తుంది.

చిరంజీవి, బాలయ్య సినిమాల కంటే ‘వారసుడు’ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు. మంచి స్క్రీన్స్ ‘వారసుడు’కి ఇచ్చేస్తున్నారనే వార్తలు చిరు, బాలయ్య అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో మొత్తంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ దిల్ రాజు మీద ఫుల్ ఫైర్ మీదున్నారు. ఈ విషయంలో దిల్ రాజు ఎంతగా తనను తాను సమర్ధించుకుంటున్నా.. ఆయన వాదనతో ఎవరూ ఏకీభవించడం లేదు. దిల్ రాజు తెలుగు సినిమాలకు అన్యాయం చేస్తున్నారనే భావన జనాల్లో కలుగుతుంది.

ఈ క్రమంలో ‘వారసుడు’ రిలీజ్ సమయంలో సోషల్ మీడియాలో జనాలు సినిమాను ట్రోల్ చేయడానికి ఏ అంశం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటారు. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా.. నెగెటివ్ ప్రచారం జరగడం ఖాయం. దీన్నంతా తట్టుకొని విజయ్ ‘వారసుడు’ ఎంతవరకు నిలబడుతుందో చూడాలి!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus