ప్రతి ఒక్కరినీ ప్రభాస్ ప్రేమలో పడేస్తాడు – నీల్ నితిన్ ముఖేశ్

  • May 4, 2018 / 01:19 PM IST

తెలుగు ప్రజలందరూ ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలకు డార్లింగ్ అయిపోయారు. ఈ విషయాన్నీ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ చెప్పారు. ఇతను సాహో సినిమా ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం కాబోతున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం ఈ మూవీ అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటోంది. 40 రోజుల పటు ఈ షూటింగ్ జరగనుంది. సాహో టీమ్ మొత్తం అక్కడే ఉంది. సో అందరూ డిన్నర్ కలిసి చేస్తున్నారు. పగలంతా ప్రభాస్ తో కెమెరా ముందు ఫైట్ చేసే నీల్ నితిన్ ముఖేశ్ సాయంత్రం అయితే .. అదే ప్రభాస్ తో కలిసి నవ్వుతూ డిన్నర్ చేస్తున్నారు.

ఈసారి డిన్నర్ కి తన భార్యని కూడా తీసుకెళ్లారు. అప్పుడు నీల్ దంపతులతో ప్రభాస్ న డుచుకున్న తీరు అందరినీ ప్రేమలో పడేసింది. ఒక స్టార్ హీరోగా కాకుండా ఫ్రెండ్ గా కలిసి పోవడంతో బాలీవుడ్ నటుడు సంతోషపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పారు. “నా దృష్టిలో ప్రభాస్ నేషనల్ డార్లింగ్ .. ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరినీ వెంటనే తన ప్రేమలో పడేసేలా చేస్తాడు. నా కుటుంబ సభ్యులతో ఆయన చనువుగా గడిపిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది” అంటూ తాను తన భార్య ప్రభాస్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus