`నేను లోక‌ల్` సెన్సార్ పూర్త‌యింది

నేచురల్ స్టార్ నాని హీరో గా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెన్సార్ నేడు పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను అందించారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ మా `నేను లోకల్`సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ స‌భ్యులు మా చిత్రానికి యు/ఎ ను అందించారు. ఈ చిత్రంతో నానికి రెండు హ్యాట్రిక్‌లు పూర్త‌వుతాయి. కేర‌క్ట‌ర్‌ బేస్‌డ్ ల‌వ్‌స్టోరీస్ అయిన ఇడియ‌ట్‌, ఆర్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కేర‌క్ట‌ర్ బేస్డ్ ల‌వ్‌స్టోరీ తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. యాటిట్యూడ్ ఈజ్ ఎవిరీథింగ్ అనే క్యాప్ష‌న్ పెట్టాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. నెక్స్ట్ ఏంటి? అనే పాట కుర్ర‌కారుకు చాలా బాగా న‌చ్చింది. లోక‌ల్ గురించిన సైడ్ సైడ్ పాట కూడా చాలా పెద్ద స‌క్సెస్ అయింది. దేవిశ్రీ ప్ర‌తి పాట‌కూ చాలా మంచి ట్యూన్ ఇచ్చారు.

ర‌చ‌యిత‌లు చ‌క్క‌గా రాశారు. ఒక్క‌సారి విన‌గానే మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా ఉన్నాయ‌ని నాతో చాలా మంది అన్నారు. నాని నేచుర‌ల్ పెర్‌ఫార్మ‌ర్‌. ఇందులో ద‌ బెస్ట్‌గా న‌టించాడు. కీర్తి ఈ సినిమాలో మంచి రోల్ చేసింది.ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఫిబ్ర‌వ‌రి 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. మా సంస్థ నుంచి వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటార‌ని తెలుసు. వారి అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మేం `నేను లోక‌ల్‌`ను తెర‌కెక్కించాం“ అన్నారు. నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర పోషించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus