లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంతకాలం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉండి గత నెల 9వ తేదీ మహాబలిపురంలోని ఒక రిసార్ట్లో ఎంతో ఘనంగా తనని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే నయనతార వివాహం పలువురు స్టార్ సెలబ్రిటీలు అత్యంత సన్నిహితులు మధ్య జరిగింది.ఈ క్రమంలోనే నయనతార తన పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే నయనతార విగ్నేష్ దంపతులు చేసిన ఈ చిన్న పనికి నెట్ ఫ్లిక్స్ వీరిద్దరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. నయనతార విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుకలు 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లిని నెట్ ఫ్లిక్స్ భారీగా ఖర్చుపెట్టి ఎంతో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వీరి పెళ్లి వేడుకను ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో ఆ వేడుకను చిత్రీకరించారు.
ఈ విధంగా వీరిద్దరి పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియోలు ఫోటోలు కూడా అభిమానులతో పంచుకోలేదు. అయితే వీరి పెళ్లి జరిగి నెల రోజులు పూర్తి కావడంతో నెట్ ఫ్లిక్స్ వీరి పెళ్లి వీడియోను ప్రసారం చేయడానికి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే నయనతార దంపతులు వీరి పెళ్లిరోజులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా పెళ్లికి వచ్చిన ముఖ్య అతిథుల ఫోటోలను షేర్ చేయడంతో
నెట్ ఫ్లిక్స్ నయనతార దంపతులపై ఆగ్రహం ప్రదర్శించడమే కాకుండా వాళ్లు కుదుర్చుకున్న ఒప్పందం కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమ పెళ్లి జరిగి నెల రోజులు అవుతున్న నేపథ్యంలో తమ పెళ్లిపై అందరికీ ఆసక్తి తగ్గుతుందన్న ఉద్దేశంతోనే తాము అలాంటి ఫోటోలు షేర్ చేశామని విగ్నేష్ దంపతులు వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ నెట్ ఫ్లిక్స్ వీరితో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయాలని ఆలోచనలు ఉండడంతో నయనతార దంపతులకు కాస్త చేదు అనుభవం ఎదురైంది.