న్యూక్లెయా కంపోజ్ చేసిన భారతీయ పాటతో మనీ హెయిస్ట్ చివరి సీజన్ ను నెట్ ఫ్లిక్స్ సెలబ్రేట్ చేసుకుంది

వీరాభిమానులైన అనిల్ కపూర్, రానా దగ్గుపాటి, రాధికా ఆప్టే, హార్థిక్ పాండే ఇక ఎంతమాత్రం వేచి ఉండలేరు; జల్దీ ఆవో అంటూ పాడుతున్న అభిమానులు- న్యూక్లెయా కంపోజ్ చేసిన భారతీయ పాటతో మనీ హెయిస్ట్ చివరి సీజన్ ను నెట్ ఫ్లిక్స్ సెలబ్రేట్ చేసుకుంది, ఇందులో సూపర్ అభిమానులూ ఇందులో ఉన్నారు

జల్దీ ఆవో, లవాకరా యే, వెకమకవా, వెన్ రాపిడో….భాష ఏదైనా సరే…భావం మాత్రం ఒక్కటే. ఇప్పటికే ఏడాది గడిచింది. ఇక్కడ ఇప్పుడు మనం మన ప్రొఫెసర్ మేధస్సును చూడాల్సిందే. ఇక మనం ఎంత మాత్రం వేచిఉండలేం. ఢి- డే కు సమీపించాం. ఇక ఇప్పుడు మనం పాడుదాం బెల్లా సియో….జల్దీ ఆవో. న్యూక్లెయా కంపోజ్ చేసిన ఈ పాటలో సెలెబ్రిటీ అభిమానులు అనిల్ కపూర్, రానా దగ్గుపాటి, రాధి కా ఆప్టే, హార్థిక్ పాండే, విక్రాంత్ మాసె, శృతి హాసన్ లాంటి వారంతా ఇందులో కనిపిస్తారు. బెల్లా సియోకు ఒక సృజనాత్మక రూపకల్పన జల్దీ ఆవో. ఇది ఈ షో అభిమానులకు అంకితం. ఇది మన భావోద్వేగాలకు సరిగ్గా అద్దం పడుతుంది. ఆయా పాత్రల పట్ల మన ప్రేమాభిమానాలను చాటి చెబుతుంది. మీ అభిమాన తారలను చూసేందుకు సిద్ధం కండి.

ఈ పాట కంపోజర్ అయిన న్యూక్లెయా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘మనీ హెయిస్ట్ కు నేనో వీరా భిమానిని. అందుకే దీనికి పని చేయడం ఎంతో సరదాగా అనిపించింది. ఈ సిరీస్ ను అభిమానించే వారెవరైనా నేను, మనం, అభిమానులంతా ఏమనుకుంటున్నారో దాన్నే ఈ పాట ప్రతిబింబిస్తుంది. ఈ వీడియోను షూట్ చేయడం ఎంతో అద్భుత అనుభవాన్ని అందించింది. ఇందులో కనిపించే గొప్ప గొప్ప కళాకారులంతా దానికి జీవం పోశారు. ఈ పాట అన్ని భాషల్లోనూ ఉంటుంది. దేశమం తటా అభిమానుల స్ఫూర్తిని వేడుక చేసుకునేలా ఉంటుంది. ఇక చివరిగా నేను చెప్పేది ఒక్కటే – మనీ హెయిస్ట్ – జల్దీ ఆవో’’ అని అన్నారు.

ఐకానిక్ స్పానిష్ సిరీస్ ఐదో భాగం హిందీ, తమిళం, తెలుగులలో లభ్యమవుతుంది. రెండు భాగాలుగా 2021 సెప్టెంబర్ 3న మరియు డిసెంబర్ 3న విడుదల అవుతుంది. అప్పటి వరకూ ….మనీ హెయిస్ట్ సీజన్ 5….దయచేసి త్వరగా రా….

నెట్ ఫ్లిక్స్ గురించి: నెట్ ఫ్లిక్స్ ప్రపంచ అగ్రగామి స్ట్రీమింగ్ ఎంటర్ టెయిన్ మెంట్ సర్వీస్. 209 మిలియన్లకు పైగా పెయిడ్ సబ్ స్క్రయిబర్లు ఉన్నారు. 190 దేశాల్లో వీరు వివిధ భాషల్లో, వివిధ రకాల్లో టీవీ సిరీస్, డాక్యుమెంటరీ, ఫీచర్ ఫిల్మ్స్ ను చూసి ఆనందిస్తున్నారు. సభ్యులు తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడైనా, ఏదైనా ఇంటర్నెట్ అనుసంధానిత స్క్రీన్ పై చూడవచ్చు. ఎలాంటి కమర్షియల్స్, కమిట్ మెంట్స్ లేకుండా ఆయా వీడియో ప్లే, పాజ్, రెజ్యూమ్ చేయవచ్చు.

నెట్ ఫ్లిక్స్ ఇండియా నుంచి తాజా సమాచారం, అప్ డేట్స్ కోసం మమ్మల్ని IG @Netflix_IN, TW @NetflixIndia and FB @NetflixIndia పై ఫాలో అవండి.

లా కాసా డి పాపెల్ గురించి: ఈ గ్యాంగ్ బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో 100 గంటల పాటు ఉంటుంది. ఈ ముఠా సభ్యులు లిస్బన్ ను కాపాడగలిగినప్పటికీ, ప్రొఫెసర్ మాత్రం మొదటిసారిగా పట్టుబడుతాడు. తప్పించుకునేందుకు మార్గాలేవీ కనిపించవు. వారిప్పటి వరకూ ఎదుర్కొన్న వారిని మించిన శత్రువు తెరపైకి వచ్చినట్లుగా ఉంది. అదే సైన్యం. దొంగతనానికి వేసిన పథకం చివరికి ఓ యుద్ధంగా మారుతుంది.

వాంకోవర్ మీడియా గురించి: వాంకోవర్ మీడియా అనేది టీవీ ప్రొడక్షన్ కంపెనీ. 2016లో అలెక్స్ పినా చే నెలకొల్పబడింది. విభిన్నంగా ఉండే షోలు రూపొందించడం దీని లక్ష్యం. ఇప్పటి వరకూ ఇది మనీ హెయిస్ట్, ది పియర్, వైట్ లైన్స్, సై రోజోలను రూపొందించింది.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus