ఈ ఏడాది మొత్తం నెట్‌ఫ్లిక్స్‌లో సందడే సందడి.. ఏవేవి వస్తున్నాయంటే?

మీకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉందా? లేదంటే వెంటనే తీసుకోండి. ఏంటిది యాడ్‌ అనుకుంటున్నారా? కాదంటే కాదు… ఇది జస్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న సినిమాల జాబితా చెబుతున్నాం. అది చూశాక మీరు కూడా కచ్చితంగా ఇదే మాట అంటారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో తెలుగు సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేయబోతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలతోపాటు యంగ్‌ హీరోల సినిమాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. #NetflixPandaga పేరుతో పోస్టర్లు రిలీజ్‌ చేశారు.

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనే రానుంది. ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫలితం బట్టి సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఉండొచ్చు. మే నెలలో వస్తుందని దాదాపు అంచనా. అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న (Pushpa)  ‘పుష్ప: ది రూల్‌’ సినిమా కూడా ఇందులోనే.

విశ్వక్‌ సేన్‌, నేహా శెట్టిల సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ‘టిల్లు స్క్వేర్‌’, విజయ్‌ దేవరకొండ – గౌతమ్‌ తిన్ననూరి – శ్రీలీల సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనే రానుంది. ఇక బాలకృష్ణ 109వ సినిమా కూడా సేమ్‌ ఓటీటీ. ఈ సినిమాకు బాబీ డైరక్టర్‌. అల్లు శిరీష్‌ ప్రధాన పాత్రలో సామ్‌ ఆంటోన్‌ తెరకెక్కిస్తున్న ‘బడ్డీ’ ఇందులోనే తీసుకొస్తున్నారు. వీటితోపాటు యూవీ క్రియేషన్స్‌ – కార్తికేయ గుమ్మకొండ కాంబోలో రూపొందుతున్న సినిమాను ఇక్కడే రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సినిమాలతోపాటు సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ నిర్మిస్తున్న సినిమాను ఓటీటీ హక్కులు కూడా నెట్‌ఫ్లిక్స్‌కే ఇచ్చారు. కోనసీమ నేపథ్యంలో గీతా ఆర్ట్స్‌ 2 తెరకెక్కించనున్న కొత్త సినిమాను అదే ఓటీటీలో స్ట్రీమ్‌ చేస్తారు. పై చిత్రాల్లో చాలా వరకు మొత్తం సౌత్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేస్తుండటం గమనార్హం.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus