Bigg Boss 7 Telugu: హౌస్ లో అసలు ఏం జరుగుతోంది..! ఇది ఫ్యామిలీ షో నేనా ? ఫైర్ అవుతున్న ఆడియన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో మొన్న నామినేషన్స్ లో బూతులు వినిపించాయి. ఇప్పుడు స్కిట్ రూపంలో డబుల్ మీనింగ్ డైలాగులు ఆర్టిస్టుల రూపంలో కనిపించాయి. అసలు ఇది ఫ్యామిలీ రియాలిటీ షోనేనా లేదంటే జబర్ధస్త్ ని మించిపోయిన డబుల్ మీనింగ్ షోనా అని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అసలు మేటర్లోకి వెళితే., టెలికాస్ట్ అవ్వని కంటెంట్ ప్రోమోలో చూసిన ఆడియన్స్ రెచ్చిపోయి ఫైర్ అవుతుంటే, లైవ్ చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గులాబీ పురం, జిలేబీ పురం అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఒక్కొ పార్టసిపెంట్ ఒక్కో క్యారెక్టర్ లో లీనం అయిపోయాడు. పల్లెటూరి అమ్మాయిగా ఉన్న అశ్విని ఒక్కసారి వ్యాంప్ గా మారిపోయిందా అనిపించింది. ఆ మాటలు, తిప్పుకోవడం, హొయలు అన్నీ కూడా ఆడియన్స్ కి విరక్తిని తెప్పించాయి. అంతేకాదు, అర్జున్ – అశ్విని డైలాగ్స్, అశ్వినితో శివాజీ వేసిన అడల్డ్ పంచ్ లు అన్నింటి మీద ఫైర్ అవుతున్నారు ఆడియన్స్.

ఇంతకీ అశ్విని ఏమంది ? శివాజీ ఏమన్నాడు అనేది చూసినట్లయితే.,
శివాజీ – ఏంటి ఊరుని బాగా ఊపేస్తున్నావంట కదా..
అశ్విని – ఈ మాత్రం అందం ఉంటే ఊపనా మరి..
శివాజీ – నీ అందం ఒక్కసారి చూద్దాం.. తోటకి రా మరి..
సందీప్ – మరీ లేతాకు లాగా ఉంది పెద్దాయనా..
శివాజీ – ఆకు ఏదైనా ఆకే రా.. జస్ట్ మనం సున్నం రాస్తాం అంతే.,

ఆ తర్వాత అర్జున్ అశ్విని మద్యలో కూడ ఇలాంటి మాటలే వచ్చాయి. అలాగే, గౌతమ్ కూడా గులాబీ ఇస్తూ గులాబీ గులాబీని వేసుకుంటుంది అన్నాడు. దీనికి శివాజీ వేసుకోవడం కాదు, పెట్టుకోవడం అనాలి అంటూ మాట్లాడాడు. ఇక లైవ్ లో కూడా ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వస్తునే ఉన్నాయ్. జబర్ధస్త్ షోని తలపించేలా అయ్యింది బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) రియాలిటీ షో.

ఇక సీనియర్ ఆర్టిస్ట్ అయిన శివాజీ కూడా ఇలా మాట్లాడేసరికి బిగ్ బాస్ లవర్స్ ఫైర్ అవుతున్నారు. మద్యలో స్క్రిప్ట్ ఛేంజ్ చేస్తున్నా కూాడ ఆర్టిస్టులు పంచ్ లకోసం , ప్రాసలకోసం పాకులాడుతున్నారు. ఇక టాస్క్ లో అర్జున్ టీమ్ విన్నర్స్ గా నిలిచారు. ఇంకా మరిన్ని ఛాలెంజస్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. మరి ఫైనల్ గా ఎవరు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు అనేది చూడాలి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus