అది అంత ఈజీ కాదు.. నేటిజన్ కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మీ!

గత వారం రోజుల నుంచి యాంకర్ రష్మి నేటిజెన్ల ట్రోలింగ్ కు గురవుతూ ఉన్నారు. ఎప్పుడైతే అంబర్ పేట్ వీధి కుక్కల ఘటన సంచలనం సృష్టించిందో అప్పటినుంచి రశ్మిని నేటిజన్ టార్గెట్ చేస్తూ తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటన పై స్పందించిన ఈమె చిన్నారికి మద్దతు తెలుపకుండా కుక్కలకు సరైన వసతి కల్పిస్తే ఇలాంటి దాడులకు ప్రయత్నం చేయవు కదా అంటూ ఈ ఘటనపై స్పందించారు. దీంతో నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేశారు.

గత కొద్ది రోజుల క్రితం ఓ నేటిజన్ ఏకంగా రష్మిని కుక్కతో పోలిస్తూ మాట్లాడటమే కాకుండా తనని కుక్కను కొట్టినట్లు కొట్టాలి అంటూ దారుణమైన కామెంట్లు చేశారు.ఇలా జంతు ప్రేమికురాలు అయినటువంటి రష్మీ గురించి ఇలా నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నప్పటికీ ఆమె కూడా సరైన రీతిలో సమాధానం చెబుతూ వచ్చారు.

వ్యక్తిగతంగా రష్మీ జంతు ప్రేమికురాలు కరోనా సమయంలో ఈమె వీధి కుక్కలకు స్వయంగా ఆహారాన్ని తీసుకెళ్లి వాటి పోషణ చూసుకుంది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి నేటిజన్స్ ఇలా వీధి కుక్కలకి ఆహారాన్ని పెట్టి వాటి సంతతిని ప్రోత్సహిస్తున్నటువంటి రష్మీ వంటి వారిని ఈ నేరం కింద వెంటనే అరెస్టు చేయాలి అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

ఇలా నేటిజన్ చేసిన కామెంట్ పై యాంకర్ రష్మీ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే రశ్మి ఈ కామెంట్ పై స్పందిస్తూ అది అంత ఈజీ కాదు.. నీకు చేతనైనది చేసుకో అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా ఈమె మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్నేమీ చేయలేరంటూ చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం రష్మి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus