మహేష్ మూవీ సక్సెస్ వెనుక అసలు కారణాలివే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరిగింది. వరుసగా స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో సినిమాలను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు. అయితే ఈ నిర్మాతలు నెగిటివ్ టాక్ ను సైతం పాజిటివ్ గా మలచుకోవడంలో సక్సెస్ అవుతూ విజయాలను అందుకుంటున్నారు. పుష్ప ది రైజ్ సినిమాకు తొలిరోజు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.

వైరల్ అయిన టాక్ వల్ల పుష్ప మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ప్లానింగ్, ప్రమోషన్స్, స్ట్రాటజీల వల్ల పుష్ప ది రైజ్ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు రావడం గమనార్హం. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే ఫలితం రిపీట్ అవుతోంది. నెగిటివ్ టాక్ తో మొదలైన సర్కారు వారి పాట ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

వీక్ డేస్ లో కూడా సర్కారు వారి పాట భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకుంటుందని చెప్పవచ్చు. తాజాగా ట్విట్టర్ లో బ్లాక్ బస్టర్ ఎస్వీపీ ట్రెండింగ్ కావడం వెనుక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల కృషి ఎంతగానో ఉందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ప్లానింగ్ అదుర్స్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు ప్రమోషన్స్ మరింత పెంచితే మాత్రం సినిమా రిజల్ట్ మరోలా ఉండబోతుందని చెప్పవచ్చు. భరత్ అనే నేను సినిమా నుంచి వరుసగా విజయాలను అందుకుంటున్న మహేష్ బాబు త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్ లపై భారీస్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాల షూటింగ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus