Sreeleela: ఆ స్టార్ హీరోయిన్ తో శ్రీలీలను పోలుస్తున్న నెటిజన్లు.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత లేని పాత్రలు ఉన్న సినిమాలలో శ్రీలీల ఎక్కువగా నటిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కథల ఎంపికలో ఇవే తప్పులు రిపీట్ చేస్తే శ్రీలీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నెటిజన్లు చెబుతున్నారు. అయితే చాలామంది నెటిజన్లు స్టార్ హీరోయిన్ శ్రీలీలను ఆర్తి అగర్వాల్ తో పోలుస్తున్నారు.

ఇద్దరి ఫోటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఈ ఇద్దరి మధ్య ఎక్కువగానే పోలికలు ఉన్నాయని అర్థమవుతోంది. ఆర్తి అగర్వాల్, శ్రీలీల ఫోటోలను చూసిన నెటిజన్లు ఆ అమ్మే ఈ అమ్మగా మళ్లీ పుట్టిందంటూ కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల వేగంగా సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. భగవంత్ కేసరి మాత్రమే ఈ మధ్య కాలంలో శ్రీలీలకు మంచి పేరు తెచ్చిపెట్టిన నేపథ్యంలో గుంటూరు కారం సినిమా శ్రీలీల ఫేట్ ను డిసైడ్ చేయనుంది.

ఓ మై బేబీ సాంగ్ ప్రోమోలో అచ్చం ఆర్తి అగర్వాల్ లా (Sreeleela) శ్రీలీల కనిపిస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆర్తి అగర్వాల్ పోలికల గురించి శ్రీలీల ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. శ్రీలీల కెరీర్ కు ఈ సినిమా కీలకం కానుంది. శ్రీలీల రెమ్యునరేషన్ 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా నితిన్ వెంకీ కుడుముల కాంబో మూవీలో సైతం శ్రీలీల నటిస్తున్నారు.

మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సంక్రాంతి పండుగకు ఎక్కువ సంఖ్యలో సినిమాల నుంచి పోటీ ఎదురవుతుండగా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న గుంటూరు కారం ఆ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus