Balakrishna: అఘోరా అన్నారు.. లెజెండ్‌కి సీక్వెల్‌ వచ్చాడేంటి?

#BB3.. ఇప్పుడు ‘అఖండ’ అయ్యిందనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అది వచ్చింది మొదలు అభిమానుల్లో ఒకటే ప్రశ్న. అదేదో అఘోరా గెటప్‌ ఉందన్నారు… మరి వీడియోలో చూపించలేదేంటి? మీకు కూడా ఇదే ప్రశ్న మెదిలిందా… అయితే మీరు ఆ వీడియోలో చూసిన గెటప్పే అఘోరా గెటప్‌ అని టాక్‌. అవును ఇదే అఘోరా గెటప్‌ లుక్‌ అట. ఇప్పుడు అర్థమైందా మా హెడ్డింగ్‌కి అర్థం. సినిమాలో హైలైట్‌ అంటూ ప్రచారం చేసిన గెటప్‌ ఇదే.

బాలకృష్ణ – బోయపాటి అనగానే గుర్తొచ్చేది బాలయ్య వేసే ఫ్లాష్‌బ్యాక్‌ గెటప్‌. ‘సింహా’, ‘లెజెండ్‌’లో ఫ్లాష్‌బ్యాక్‌ గెటప్‌లే ఆకర్షణ. దీంతో ‘అఖండ’లో ఆ గెటప్‌ ఎలా ఉంటుందా అనుకున్నారు. ఈ లోగా అది అఘోరా గెటప్‌ అంటూ వార్తలొచ్చాయి. దాని కోసమే బాలకృష్ణ గుండు కొట్టించుకున్నాడు అని కూడా అన్నారు. కానీ టైటిల్‌ రోర్‌ వీడియోలో సాధారణ గెటప్పే కనిపించింది. ఇంకా చెప్పాలంటే ‘లెజెండ్‌’ సినిమాలో సీనియర్‌ బాలకృష్ణ పాత్రకు సీక్వెల్‌లాగా ఉందంటున్నారు నెటిజన్లు.

‘అఖండ’లో రెండు రకాల పాత్రల్లో బాలయ్య కనిపిస్తాడనే విషయం తెలిసిందే. ఒక పాత్ర లుక్‌ సినిమా షూటింగ్ స్టార్ట్‌ అయిన తొలి రోజుల్లోనే విడుదల చేశారు. ఇన్నాళ్లూ ఉరిస్తూ వచ్చిన గెటప్‌ను పేరుతో పాటు ఇచ్చారు. ఆ వీడియోలో చూస్తే నాసిరకం వర్క్‌ కనిపిస్తుంటుంది. బాలకృష్ణ భుజానికి టాటూ వేశారు. అయితే అతికించినట్లుగా అర్థమైపోతోంది. ఇలాంటివి పట్టించుకొని సినిమాకు వచ్చేసరికి కాస్త నాణ్యత చూపిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus